BigTV English

Delhi Earthquake | ఢిల్లీలో భూకంపం.. 6.3 తీవ్రత నమోదు!

Delhi Earthquake | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు ప్రారంభమైన ఈ భూకంపం చాలా సేపు వరకు భూక్రంపనలు సృష్టించిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ భూకంపం రెండు సార్లు సంభవించింది.

Delhi Earthquake | ఢిల్లీలో భూకంపం.. 6.3 తీవ్రత నమోదు!

Delhi Earthquake | దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు ప్రారంభమైన ఈ భూకంపం చాలా సేపు వరకు భూక్రంపనలు సృష్టించిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ భూకంపం రెండు సార్లు సంభవించింది. తొలిసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1 పాయింట్లు నమోదైంది. రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 6.3 పాయింట్లు నమోదైంది. భూకంపం సంభవించగానే ఢిల్లీ వాసులు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించిందని సమాచారం.


ఈ భూకంపం తొలిగా పాకిస్తాన్‌లో ప్రారంభమైంది. 2 గంటల 20 నిమిషాలకు పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, హిందు కుష్ ప్రాంతాలలో భూకంపం సంభవించింది.

భూకంపాలు ఎందుకు.. ఎలా సంభవిస్తాయి?
భూకంపాలు ఎలా వస్తాయని తెలుసుకోవడానికి.. ముందుగా ఈ భూగోళ శాస్త్రీయ నిర్మాణం గురించి అర్థం చేసుకోవాలి. ఈ భూగోళంలోని లోపలి పొరల్లో ‘లావా’ అంటే తీవ్రంగా మండే చిక్కటి ధ్రవ పదార్థం ఉంది. ఆ పదార్థంపై టెక్టోనిక్ ప్లేట్స్ తేలుతూ ఉన్నాయి. ఈ టెక్టోనిక్ ప్లేట్స్‌పై మనం నివసిస్తున్న భూభాగం ఉంది. కొన్ని సార్లు లావా వేడికి ఈ టెక్టోనిక్ ప్లేట్స్ తేలుతూ ఒకదానికి ఒకటి ఢీకొట్టు కుంటాయి. ఆ ఢీకొనే ప్రభావం భూమి పైపొర వరకు పడుతుంది. ఆ ప్రభావంతో మన చుట్టూ భూమి ప్రకంపిస్తుంది. దీన్నే మనం భూకంపం అంటాం.


భూకంపం వస్తే ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భూకంపం సంభివించనప్పుడు.. మీరు ఏదైనా భవనంలోపల ఉంటే.. వెంటనే ఒక కుర్చీ, టేబుల్ లాంటి వస్తువు కిందకు వెళ్లి తలదాచుకోవాలి. అలాంటి వస్తువులు లేకుంటే భవనంలోపల ఏదైనా ఒక మూలన కింద కూర్చొని మీతలను చేతులతో కాపాడుకోండి.

మీరు భవనం బయట ఉంటే ముందుగా ఇళ్లు, భవనాలు, చెట్లు, కరెంటు స్తంభాలకు దూరంగా వెళ్లండి.
ఒకవేళ భూకంపం వలను మీరు ఏదైనా భవన శిథిలాలో చిక్కుకొని ఉంటే.. వీలైనంత సేపు కదలకుండా ఉండాలి. ఏ వస్తువును తొందరపడి జరపకూడదు. ఎలాంటి నిప్పు పెట్టకూడదు.

శిథిలాలలో మీరు చిక్కుకొని ఉంటే.. సమీపంలోని గోడ, స్తంభం, పైపు లాంటి వస్తువుపై కొడుతూ శబ్దం చేస్తూ ఉండాలి. రెస్కూ టీమ్స్ మిమ్మల్ని కాపాడేందుకు వస్తే.. మీరు ఎక్కడ ఉన్నారో వారికి మీరు చేసే శబ్దాల ద్వారా తెలిసిపోతుంది.
ఒకవేళ మీరు కారులో ప్రయాణిస్తుంటే.. వెంటనే ఒక ప్రదేశంలో ఆగిపోయి. కారులోపలే భూకంపం ఆగిపోయేంతవరకూ కదలకుండా కూర్చోండి.
ఏమీ చేయలేని స్థితిలో మాత్రమే అంతిమంగా.. గట్టిగా అరుస్తూ సహాయం కోసం పిలవండి. ఎందుకంటే భయంతో కంగారుపడి అరుస్తూనే ఉంటే మీ ముక్కు, నోటి ద్వారా దుమ్ము ప్రవేశించి మీకు ఊపిరి సమస్యలు తీవ్రమవుతాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×