Automatic Washing Machines: చలికాలం మొదలైందంటే చాలు.. ఉదయాన్నే చన్నీళ్లలో చేతులు పెట్టి బట్టలు ఉతకడం అంటే పెద్ద సాహసమే. గడ్డకట్టే చలిలో కుటుంబం మొత్తానికి బట్టలు ఉతకడం వల్ల చేతులు మొద్దుబారిపోవడమే కాకుండా.. అలసట, జలుబు, జ్వరాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ చలికాలం కష్టాలకు చెక్ పెట్టి, మీ సమయాన్ని ఆదా చేసే ఒక మంచి 7 కేజీల ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ఇంట్లో ఉండటం చాలా అవసరం. ఒక చిన్న లేదా మధ్యతరగతి కుటుంబం బట్టలను ఒక్కసారిగా, తక్కువ సమయంలోనే శుభ్రం చేయడానికి 7 కేజీల మెషీన్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తక్కువ కరెంట్ ఖర్చుతో, బట్టలను కొత్తవాటిలా ఉంచే టాప్ 5 బ్రాండెడ్ వాషింగ్ మెషీన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
శాంసంగ్ WA70BG4441YYTL మోడల్ 7 కిలోల సామర్థ్యంతో వస్తుంది. ఇందులో 700 RPM స్పిన్ స్పీడ్, 9 వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈకో బబుల్ టెక్నాలజీ డిటర్జెంట్‌ను బుడగలుగా మార్చి బట్టలపై సమంగా పనిచేసేలా చేస్తుంది. బబుల్ స్టార్మ్ ఫీచర్‌తో సున్నితమైన దుస్తులను కూడా జాగ్రత్తగా ఉతకవచ్చు. మ్యాజిక్ ఫిల్టర్ వల్ల బట్టల నుంచి వచ్చే దూది, వెంట్రుకలు వంటివి సేకరించబడతాయి. త్వరగా ఉతికే ఆప్షన్ ఉంది. అయితే నీటి వినియోగం ఎక్కువగా ఉండొచ్చని కొందరు వినియోగదారులు చెబుతున్నారు.
ఎల్‌జీ T70VBMB1Z మోడల్ 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 8 వాష్ ప్రోగ్రామ్స్, టర్బో డ్రమ్ టెక్నాలజీ ఉన్నాయి. బట్టలు బాగా మురికిగా ఉన్నా శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కరెంట్ పోయి మళ్లీ వచ్చినప్పుడు ఆగిన చోటు నుంచే వాష్ కొనసాగించే ఆటో రీస్టార్ట్ ఫీచర్ కూడా ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ తుప్పు పట్టకుండా ఎక్కువకాలం మన్నేలా ఉంటుంది. అయితే మొండి మరకలను తొలగించడంలో అందరి అంచనాలను అందుకోకపోవచ్చని రివ్యూల్లో కనిపిస్తోంది.
Also Read: వారంటీ ఉన్నా రూ.79,000 రిపేర్ బిల్లు వేసిన యాపిల్.. చివరికి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో తెలుసా?
తక్కువ ధరలో 7 కిలోల మెషీన్ కావాలనుకునేవారు Haier HWM70-AENను పరిశీలించవచ్చు. 700 RPM స్పిన్ స్పీడ్, 8 వాష్ ప్రోగ్రామ్స్, 5 స్టార్ రేటింగ్ ఇందులో ఉన్నాయి. నీటి ఒత్తిడి తక్కువగా ఉన్నా పనిచేసే నియర్ జీరో ప్రెజర్ టెక్నాలజీ ఉంది. 40 నిమిషాల వాష్ సైకిల్ కూడా ఉంది. అయితే కొన్నిసార్లు శబ్దం ఎక్కువగా వస్తుందని వినియోగదారులు చెబుతున్నారు.
గోద్రెజ్ (WTEON ALP 70 5.0 FDUN GPGR) మెషీన్‌లో ఏఐ వాష్ టెక్నాలజీ ఉంది. ఇది బట్టల రకాన్ని బట్టి వాష్ వేగాన్ని దానంతట అదే మార్చుకుంటుంది. దీని ఫ్యాబ్రిసేఫ్ డ్రమ్ ఖరీదైన బట్టలు పాడవకుండా సున్నితంగా శుభ్రం చేస్తుంది. తక్కువ నీటి ప్రెజర్ ఉన్నా పనిచేయడంతో పాటు 12 వాష్ ప్రోగ్రామ్‌లు ఇందులో ఉన్నాయి. దీనికి 5 ఏళ్ల సమగ్ర వారంటీ, మోటార్‌పై 10 ఏళ్ల వారంటీ లభిస్తుంది.
ఫ్రంట్ లోడ్ మెషీన్ కావాలంటే Haier EFL70-IM12F3BKU1 చూడొచ్చు. ఇందులో 15 వాష్ ప్రోగ్రామ్స్, AI ఫ్యాబ్రిక్ డిటెక్షన్, ప్యూరిస్టీమ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇన్‌బిల్ట్ హీటర్‌తో వేడి నీటిలో బట్టలు ఉతకవచ్చు. ఇన్వర్టర్ మోటార్ శబ్దం, వైబ్రేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కొనుగోలుకు ముందు మీ ఇంటి స్థలం, నీటి సరఫరా, వారంటీ, ధరలను పోల్చి చూసుకోండి. ఉతికే బట్టల పరిమాణాన్ని బట్టి 7 కిలోల సామర్థ్యం సరిపోతుందో లేదో నిర్ణయించండి. వివరాలు చూసి ఎంచుకుంటే మీ బడ్జెట్‌కు, అవసరానికి సరిపోయే మెషీన్‌ను తీసుకోవచ్చు.
Also Read: కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?