Hyderabad: తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీలో నేతల మధ్య అంతర్గత సమస్యలు, పని తీరుపై అంచనా వేసేందుకు కొత్త ఇన్ ఛార్జ్ సందీప్ రంగంలోకి దిగేశారు. మంత్రులు, ముఖ్యనేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయనతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.