Tanveer Ahmed cooked Vaibhav Sooryavanshi: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపధ్యంలో వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేయడంపై తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యాడు. గుడ్డిగా బ్యాట్ ఊపేవాళ్లు వన్డేలకు పనికిరారని పరుగు తీశాడు. కేవలం టీ20లో మాత్రమే ఆడే వైభవ్ సూర్యవంశీని అనవసరంగా ఆసియా కప్ టోర్నమెంట్ కోసం సెలెక్ట్ చేశారని బీసీసీఐ సెటైర్లు వేశాడు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి అనవసరంగా హైప్ ఇస్తున్నారని హేళన చేశాడు.. పాకిస్తాన్ లాంటి సరైన బౌలర్లు తగిలితే వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఎండ్ అవుతుందని హెచ్చరించాడు.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో వరుసగా విఫలమవుతున్న వైభవ్ సూర్యవంశీ పై తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యాడు. ఐపీఎల్, టీ20 క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ గుడ్డిగా బంతులను బాదుతాడని.. అది చూసి టీమిండియా క్రికెట్ అభిమానులు సంబరపడిపోయారని చురకలు అంటించాడు. కానీ 50 ఓవర్ల మ్యాచ్ లు అలా ఉండవని తెలిపాడు. అందుకే 50 ఓవర్ల క్రికెట్ లో వైభవ్ సూర్యవంశీ నిలదొక్కుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించాడు.
ఈ టోర్నమెంట్ లో ఆడిన రెండింటిలో వైభవ్ విఫలమైనట్టు గుర్తు చేశాడు. వన్డే క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపిక.. కేఎల్ రాహుల్ లాంటి టెక్నిక్స్ ఉండాలని సూచనలు చేశాడు. ఇంత చిన్న వయసులో వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకొని అతనిపై భారం పెడుతున్నారని ఫైర్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్, బ్రాడ్ మన్ లాంటి దిగజాలతో అతన్ని పోల్చడం సరికాదని చురకలు అందించాడు.
పాకిస్తాన్ లాంటి నాణ్యమైన బౌలర్లు తగిలితే వైభవ్ సూర్యవంశీ ఆటలు సాగవని హెచ్చరించాడు. అన్ని జట్లపై తన్వీర్ అహ్మద్ బాగా ఆడినప్పటికీ ఇప్పటి వరకు పాకిస్తాన్ పై మెరవలేదని పరువు తీశాడు. వైభవ సూర్యవంశీ ఆడితే ఎక్కువ మంది చూస్తారని బీసీసీఐఐ కక్కుర్తి పడుతోందని ఫైర్ అయ్యాడు. కేవలం టీర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే అతన్ని తీసుకుంటున్నారని.. వైభవ్ లో ఎలాంటి టాలెంట్ లేదని బీసీసీఐకి కూడా తెలుసు అంటూ బాంబు పేల్చాడు. కాగా, ఈ టోర్నమెంట్ లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు 37 పరుగులు మాత్రమే చేశాడు. నేపాల్ పై 26 పరుగులు చేయగా, పాక్ పై 11 రన్స్ సాధించాడు.