BigTV English

Delhi Police arrests Spider Man: ఢిల్లీలో స్పైడర్‌మెన్ అరెస్ట్, ఏం చేశాడంటే..

Delhi Police arrests Spider Man: ఢిల్లీలో స్పైడర్‌మెన్ అరెస్ట్, ఏం చేశాడంటే..

Delhi Police arrests Spider Man: అసలే టెక్ యుగం, పాపులర్ అయ్యేందుకు యూత్ రకరకాల విన్యా సాలు చేస్తున్నారు. ఈ విన్యాసాలు ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు లేకపోలేదు. రీల్స్ చేయాలని కొందరు, సోషల్‌మీడియాలో హైలెట్ కావాలని మరికొందరు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ప్రమాదకరమై స్టంట్స్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. జైలుకి వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. అధికారులు హెచ్చరించినా ఏ మాత్రం మారలేదు.


ఇలాంటి స్టంట్స్ చేసి ఢిల్లీ పోలీసులకు అడ్డంగా చిక్కాడు ఆదిత్య అనే యువకుడు. ఢిల్లీలో 20 ఏళ్ల ఆదిత్య అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి డేంజర్ స్టంట్స్ చేశాడు. ద్వారకా ప్రాంతంలో 19 ఏళ్ల గౌరవ్‌సింగ్-ఆదిత్య రీల్స్ చేయాలని ప్లాన్ చేశారు. ఏమి చేస్తే సోషల్‌మీడియా‌లో హైలెట్ అవుతామని భావించారు. దీనికి కోసం పక్కాగా స్కెచ్ వేయడం, ఇంప్లిమెంట్ చేయడం చకచకా జరిగిపోయింది. అసలే ఢిల్లీలో డేంజర్ స్టంట్స్ అంటే పోలీసులు ఊరుకుంటారు. తమ రూల్స్ బుక్‌కి పని కల్పించారు. యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అసలు విషయానికొద్దాం. ఆదిత్య స్పైడర్‌మెన్ గెటప్‌లో దర్శనమిచ్చారు. గౌరవ్ కారు నడుపు తుండగా, ఆదిత్య కారు బానెట్‌పై కూర్చుని, నిలబడి ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. చాలా సేపు కారుపై ట్రావెల్ చేశారు. వీరి విన్యాసాలు కొందరి చూస్తూ ఉండిపోయారు. యువకుల రీల్స్‌పై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగేశారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.


ALSO READ: ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!

గతంలోనూ ఆదిత్య ఇలాంటి విన్యాసాలు చేసి జైలు పాలయ్యాడు. అప్పుడూ స్పైడర్‌మెన్ గెటప్‌లో మరో యువతితో కలిసి టూ వీలర్స్‌పై ఢిల్లీ వీధుల్లో స్టంట్స్ చేశాడు. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ఇద్దర్నీ అరెస్టు చేశారు. అయినప్పటికీ ఆదిత్యలో ఏ మాత్రం మార్పులు రాలేదు. సీటు బెల్ట్ ధరించనందుకు 25000 రూపాయలు ఫైన్ వేసే అవకాశముంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×