E-Paper
Advertisement

దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, నాలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి

దీపావళి ఎఫెక్ట్.. డేంజర్ స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం, నాలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి
Advertisement

Delhi Air Quality: దీపావళి వేడుకల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీపై పడింది. ఫలితంగా నగరమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ ఉదయం నగరంలో గాలి నాణ్యత సూచీ వెరీ పూర్ కేటగిరీకి చేరింది. దీంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయుకాలుష్యం

దీపావళి మరుసటి రోజు సోమవారం రోజు ఉత్తరాది రాష్ట్రాలను వాయు కాలుష్యం వెంటాడుతోంది. పంజాబ్, యూపీ, హర్యానా, ఢిల్లీలో ఇవాళ ఉదయం నుంచి దట్టమైన బూడిద రంగు పొగమంచు కమ్మేసింది. దీనివల్ల ఎదురుగా ఏ వాహనాలు వస్తున్నాయో కనిపించడం లేదు. దీనికితోడు రాత్రి దీపావళి ఫెస్టివల్ సందర్భంగా వాయు కాలుష్యం ఆ నాలుగు రాష్ట్రాలను కమ్మేసింది.  ఫలితంగా ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత సూచిక అమాంతంగా పడిపోయింది.

దీపావళి ఫెస్టివల్ తర్వాత డేంజర్ స్థాయికి గాలి నాణ్యత

Advertisement

ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడ కాలుష్కం డేంజర్ స్థాయిని దాటేసింది. ఏకంగా గాలి స్వచ్చత ఇండెక్స్‌లో ఏక్యూఐ- 370కి చేరిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సూచీ ప్రకారం తీవ్రమైన కేటగిరీకి దగ్గరగా ఉంది అక్కడ గాలి నాణ్యత. బురారి క్రాసింగ్ ఏరియాలో అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి. ఒక్కొక్క దానిలో AQI 437గా నమోదు అయ్యింది. మరో నాలుగు కేంద్రాలు పేలవమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి.

కాలుష్య నియంత్రణ బోర్డు ఇండెక్స్ ప్రకారం.. 0 నుండి 50 మధ్య AQI ని మంచిది గా చెబుతారు. అదే 51 నుండి 100 మధ్య సంతృప్తికరమైనదిగా వర్ణిస్తారు. 101 నుండి 200 మధ్య బెటర్‌గా సూచిస్తారు. 201 నుండి 300 మధ్య పేలవమైనది చెబుతారు. ఇక 301 నుండి 400 మధ్య దారుణంగా ఉందని వర్ణించారు. 401 నుండి 500 మధ్య తీవ్రమైనదిగా వర్గీకరణ చేస్తారు అధికారులు.

Advertisement

ALSO READ: కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

బవానా, బురారి, జహంగీర్‌పురి, సోనియా విహార్, పంజాబీ బాగ్, ఓఖ్లా, రోహిణి వంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా ఉందని ఇండెక్స్ చెబుతోంది. వాయు నాణ్యత ముందస్తు హెచ్చరిక ప్రకారం.. ఢిల్లీలో గాలి నాణ్యత పగటి పూట తీవ్రమైన కేటగిరీలోకి జారింది. రాబోయే కొద్ది రోజుల పాటు అదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వాహన ఉద్గారాలు, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వంటివి దీనికి కారణంగా చెబుతున్నారు.

 

Related News

కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!

Big Stories

Advertisement
×