E-Paper
Advertisement

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు
Advertisement

Faridabad: సమస్యపై కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది. ఆవేశాలకు కోపాలకు వెళ్లిపోయారు. ఫలితంగా 19 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పొరుగు వ్యక్తి చేతిలో టెక్ మహీంద్రా మాజీ అధికారి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన యూపీలో తీవ్ర కలకలం రేపింది. అసలు ఏం జరిగింది?

యూపీలో దారుణహత్య.. పార్కింగ్ వివాదం జఠిలం

ధంతేరాస్ వేళ యూపీలోని ఫ‌రీదాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్టార్ 21సీ లో రెండు ఫ్యామిలీల మధ్య పార్కింగ్ వివాదం తలెత్తింది. ఫలితంగా ప‌ర‌మ్‌జీత్ ధంక‌ర్ అనే వ్యక్తి, అపార్ట్‌మెంట్‌లోని మ‌రో వ్యక్తిని గన్‌తో కాల్చి చంపాడు. నిందితుడ్ని సోనూశ‌ర్మగా గుర్తించారు పోలీసులు. లైసెన్స్ పిస్తోల్‌తో సోనూ కాల్పులు జ‌రిపిన‌ట్లు గుర్తించారు అధికారులు. మొత్తం 19 రౌండ్లు కాల్పులు జరపగా అందులో 9 బుల్లెట్లు ప‌రంజీత్‌ వ్యక్తి శరీరంలోకి దూసుకుపోయాయి. ఎవరీ పరంజీత్?

సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య

Advertisement

గతంలో టెక్ మ‌హేంద్ర కంపెనీలో రీజిన‌ల్ హెడ్‌గా ఆయన ప‌ని చేశారు. ఇప్పుడు వియత్నాంకు చెందిన ఎఫ్‌పిటి సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్ సింగపూర్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అపార్ట్‌మెంట్‌లో ఫ‌స్ట్ ఫ్లోర్ 641 ఇంటి నెంబ‌ర్‌లో నివాసం ఉంటున్నారు. మేన‌ల్లుడి పెళ్లి కోసం రెండు రోజుల కిందట ఫరీదాబాద్ వచ్చాడు. ఈనెల 24న వివాహం పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. శుక్రవారం రాత్రి జిమ్ నుంచి తిరిగి వ‌చ్చిన ప‌రంజీత్‌, పార్కింగ్ విషయంలో మోహ‌న్‌తో వాగ్వాదం జ‌రిగింది. ఆ బిల్డింగ్‌ మూడో ఫ్లోర్‌లో మోహ‌న్ ఉంటున్నాడు. వెహిక‌ల్ పార్కింగ్ గురించి గొడ‌వ జ‌రిగిందా? పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ చోటు చేసుకుందా?అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు చెబుతున్న వివరాల మేరకు.. ఆ రెండు కుటుంబాల మ‌ధ్య చాన్నాళ్లుగా గొడ‌వ‌లు ఉన్నాయని చెబుతున్నారు. కొన్ని రోజుల కిందట ప‌రంజీత్ కొడుకుపై మోహ‌న్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు మోహన్‌ని శనివారం రాత్రి బల్లభ్‌గఢ్‌లో అరెస్టు చేశారు.

Advertisement

ALSO READ: మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

నిందితుడి నుంచి లైసెన్స్ ఉన్న హ్యాండ్‌గన్, ఆయుధాన్ని భద్రపరిచేందుకు ఉపయోగించిన బ్యాగ్‌లో 59 తూటాలు, రెండు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. శర్మకు చెందిన జర్మన్ షెపర్డ్ కుక్క గ్రౌండ్ ఫ్లోర్‌లోని పార్కింగ్ ప్రదేశంలో మల విసర్జన చేసిందనే ఆరోపణలపై ఈ రెండు కుటుంబాల మధ్య సుమారు మూడు నెలలుగా వాగ్వాదం జరుగుతోంది.

Related News

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!

మోదీ పాలనపై సోనియా ఫైర్.. 1975 నాటి ఎమర్జెన్సీపై క్లారిటీ.. కేంద్రమంత్రులు స్ట్రాంగ్ కౌంటర్!

నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్న భార్య.. అయినా భరణం కావాలని భర్తపై కేసు.. కోర్టు తీర్పు ఇదే

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని వారికి మరో ఛాన్స్!

Big Stories

Advertisement
×