Kris Srikkanth On Ali Raza: ఆసియా 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (ACC Men’s U19 Asia Cup 2026 Tournament) నేపథ్యంలో టీమిండియాపై పాకిస్తాన్ సూపర్ విక్టరీ అందుకుంది. అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో భారత జట్టును చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీలు విమర్శలు చేస్తున్నారు. తమ దెబ్బకు 150 కోట్ల భారతీయులను దీపావళి రోజున నిద్ర పోకుండా చేశామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పాకిస్తాన్ రెచ్చిపోతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ( Kris Srikkanth ) తన స్టైల్ లో స్పందించాడు. అంకుల్స్ ను తీసుకువచ్చి అండర్ 19 పాకిస్తాన్ జట్టు తరఫున ఆడించారని ఫైర్ అయ్యాడు. 35 సంవత్సరాల అలీ రజాను అండర్ 19 మ్యాచ్ ఆడిస్తారా..? అంటూ ప్రశ్నించాడు. సీనియర్ ప్లేయర్లను బరిలోకి దింపి గెలిస్తే, ఇంత ఓవరాక్షనా ? అసలు కొంచమైనా బుద్ధుందా అంటూ ఫైర్ అయ్యాడు.
ఆసియా కప్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజిలో టీమిండియాను జూనియర్ పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో టీమిండియా పరువు తీసామని రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ నెటిజెన్స్. అయితే దీనిపై కృష్ణమాచారి శ్రీకాంత్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. 30 సంవత్సరాలు దాటిన అంకుల్స్ ను బరిలో దింపి ఇండియాను ఓడించారని విమర్శలు చేశాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అలీ రాజా గత నాలుగు సంవత్సరాలుగా అండర్ 19 టోర్నమెంట్ ఆడుతున్నాడని… ఇది అతడికే ఐదవ ఆసియా కప్ ట్రోఫీ అంటూ హేళన చేశాడు.
భూమి పుట్టినప్పుడు పుట్టిన అలీ రాజా.. ఇంకా 18 సంవత్సరాలు అంటే ఎవడు నమ్ముతాడని ఫైర్ అయ్యాడు. అలీ రజా వయసుపై వెంటనే ఏషియన్ క్రికెట్ బోర్డు కౌన్సిల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అతడి వయసుపై అందరికీ అనుమానాలు ఉన్నాయని కోరాడు. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన మ్యాచ్ లో అలీ రాజా (Ali Raza) రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లు వేసిన అలీ రాజా 37 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో మూడు వికెట్లు కూడా తీసి టీమిండియాను ఓడించాడు. ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 46.3 ఓవర్లు వాడిన టీమిండియా (Team India) 208 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కాస్త జాగ్రత్తగా ఆడిన పాకిస్తాన్ (Pakistan Team).. 48.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి విక్టరీ అందుకుంది.