E-Paper
Advertisement

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి
Advertisement

Woman Earns Lakhs While Sleeping| రోజూ నిద్రపోవడం మనందరికీ అలవాటే. అయితే అదే నిద్రతో లక్షల రూపాయలు సంపాదించవచ్చంటే నమ్ముతారా? ముంబైకి చెందిన జినియా ఛటర్జీ ఈ విషయాన్ని నిజం చేసి చూపించారు. 2 నెలల పాటు ఆమె నిద్రపోతూ ఏకంగా రూ.9.6 లక్షల బహుమతి గెలుచుకున్నారు. అంతేకాదు, ఉచిత విదేశీ పర్యటన అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్ అంటే ఏమిటి?

వేక్‌ఫిట్ కంపెనీ ఈ వినూత్న పోటీ నిర్వహించింది. మంచి నిద్ర ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. 2019లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజా పోటీకి ఏకంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పలురకాల ఎంపిక పరీక్షలు, వ్యక్తిగత ఇంటర్వ్యూల తర్వాత పది మందిని ఎంపిక చేశారు. వీరంతా సుమారు 60 రోజుల పాటు పోటీలో పాల్గొన్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిద్ర క్వాలిటీని మెరుగుపరుచుకోవడం వంటి అలవాట్లు పాటించారు. వారి నిద్రకు సంబంధించిన స్కోర్ల ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.

పోటీలో ఆసక్తికరమైన టాస్కులు

Advertisement

ఈ పోటీలో కేవలం నిద్రపోతే సరిపోదు. ప్రతి వారం కొన్ని సరదా పనులను కూడా పూర్తి చేయాల్సి వచ్చింది. స్లీప్ సినిమా అనే టాస్క్‌లో ప్రముఖ సినిమాల్లోని సన్నివేశాలను నిద్రకు సంబంధించిన విధంగా నటించి చూపించాలి. స్లీప్ బింగోలో తమ నిద్ర అలవాట్లను పరిశీలించాలి.
అండర్‌కవర్ స్లీప్ మిషన్‌లో భాగంగా సంభాషణల్లో ‘బ్లాంకెట్’, ‘పిల్లో’ అనే పదాలను పదిసార్లు ఉపయోగించాలి. అయితే ఎదుటివారికి తమ ప్లాన్ తెలియకుండా ఈ పని పూర్తి చేయాలి. ప్రతి వారం బెస్ట్ పర్ఫామెన్స్ చూపినవారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ అనే గుర్తింపు ఇచ్చారు.

ఫైనల్ రౌండ్‌లో నలుగురు మాత్రమే

రెండు నెలల పోటీ తర్వాత జినియా ఛటర్జీ, రత్నగిరి మణికందన్, మెహెక్ ఖోట్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ వైల్డ్‌కార్డ్ ద్వారా ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో చివరి పోటీలో నలుగురు పాల్గొన్నారు.

Advertisement

Also Read: రాత్రి హైవేపై పంక్చర్‌తో ఆగిన లగ్జరీ కారు.. ఉదయం చూస్తే పూర్తిగా దగ్ధం.. బీమా నిరాకరించిన కంపెనీపై కేసు

రూ.9.6 లక్షలు గెలిచిన జినియా ఛటర్జీ

ఫైనల్‌లో రెండు ప్రత్యేక టాస్కులు నిర్వహించారు. మొదటిది మెమరీ ఫోమ్ ఛాలెంజ్. ఇందులో బెడ్‌రూమ్ ఏర్పాట్లను ఫొటోల్లో చూసినట్లుగా మళ్లీ అమర్చాలి. రెండోది స్లీప్ ఆక్షన్. ఇందులో దిండ్లు, దుప్పట్లు, లైటింగ్, శబ్దం, ఏసీ వంటి సౌకర్యాలను ఎంచుకుని మంచి నిద్ర వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి.
ఈ టాస్కుల తర్వాత పోటీదారులు తమకు నచ్చిన బెడ్‌రూమ్‌లలో చివరిసారిగా నిద్రపోయారు. వారి నిద్ర స్కోర్ల ఆధారంగా విజేతను నిర్ణయించారు. జినియా అత్యధిక స్కోరు సాధించి రూ.9.6 లక్షలు గెలుచుకున్నారు. వేక్‌ఫిట్ నుంచి ప్రత్యేక హాలిడే ప్యాకేజీని కూడా అందుకున్నారు.

Also Read: క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్‌లో ఈ పొరపాటు చేస్తే అప్పు పెరుగుతూనే ఉంటుంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

స్లీప్ ఇంటర్న్‌షిప్‌కు భారీ స్పందన

వేక్‌ఫిట్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి నాలుగు సీజన్లకు రూ.10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 65 మంది ఇంటర్న్‌లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున కంపెనీ బహుమతులు ఇచ్చిది. ఇక తదుపరి సీజన్ అంటే సీజన్ 6 కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్నవారు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.

Related News

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!

మోదీ పాలనపై సోనియా ఫైర్.. 1975 నాటి ఎమర్జెన్సీపై క్లారిటీ.. కేంద్రమంత్రులు స్ట్రాంగ్ కౌంటర్!

నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్న భార్య.. అయినా భరణం కావాలని భర్తపై కేసు.. కోర్టు తీర్పు ఇదే

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని వారికి మరో ఛాన్స్!

సీజేఐ సూర్యకాంత్‌పై వివాదాస్పద పోస్ట్.. కేరళ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు!

‘పేదలు కాలుష్యం చేయరు.. ధనికులే అసలు కారణం’.. ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం!

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

Big Stories

Advertisement
×