E-Paper
Advertisement

కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

కూర రుచిగా లేదన్నందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపి ఆ తర్వాత, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన
Advertisement

Ahmedabad: నిత్యం మనుషులు కోపాలతో ఉంటున్నారు.  ఎవరైనా ఏమైనా అంటే ఆగ్రహానికి గురవుతున్నారు.. విచక్షణ కోల్పోయి హత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కూర రుచిగా లేదని చెప్పినందుకు భర్తని దారుణంగా చంపేసింది భార్య. సంచలనం రేపిన ఈ ఘటన గుజరాత్ లో వెలుగుచూసింది. అసలు ఏం జరిగింది?

అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ సమీపంలోని నరోడా స్మార్ట్ సిటీలో నివాసం ఉంటోంది ఓ దంపతులు. దిలీప్ ఖరాడి(39), నిర్మలా ఖరాడి(34) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత దిలీప్ ఖరాడి GMDCలో డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శుక్రవారం రాత్రి డ్యూటీ చేసుకుని రాత్రి ఇంటికి వచ్చాడు దిలీప్.

కూర రుచిగా లేదన్నందుకు భర్తని లేపేసిన భార్య

Advertisement

భర్తకు భోజనం వడ్డించింది భార్య నిర్మల. కూర రుచిగా లేదని భర్త చెప్పడంతో భార్య ఆగ్రహానికి కారణమైంది. ఆ తర్వాత దిలీప్-నిర్మలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో తట్టుకోలేకపోయిన నిర్మల వంట గది కత్తిని తీసుకుని భర్త ఛాతీకి ఎడమ భాగంలో పొడిచింది. కత్తి గుండెకు పైభాగంలో తగలడంతో దిలీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి జరిగిన తర్వాత నిర్మల స్వయంగా దిలీప్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రికి దిలీప్ చేరుకునేసరికి భర్త మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ALSO READ: పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

Advertisement

ఈ ఘటన గురించి తెలియగానే దిలీప్ తండ్రి నరోడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మలాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. దిలీప్- అతడి భార్య మధ్య చాన్నాళ్లుగా కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఇల్లు, ఆర్థిక విషయాలపై తరచు భార్యాభర్తలు గొడవ పడుతున్నారట. శుక్రవారం రాత్రి అది కాస్త జఠిలమైంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనపై నిర్మల తన బావ ముఖేష్‌కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Related News

4 లక్షల మందికి విందు, గుర్రాల రేసు, విజేతకు కారు బహుమతి.. కూతురు పెళ్లిలో ఎమ్మెల్యే హంగామా

పార్కింగ్ వివాదం.. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఓఓ దారుణ హత్య, 19 రౌండ్లు కాల్పులు

మావోయిస్టుల గడ్డపైకి ప్రధాని.. బలగాలతో కలిసి దీపావళి వేడుకలు.. ‘దిమాగీ నక్సల్స్’పై సంచలన వ్యాఖ్యలు!

దీపావళి ముందు తీవ్ర విషాదం.. రోడ్డుపై లేడీ డ్రైవర్ బీభత్సం.. బైకర్‌ను 30 మీటర్లు ఈడ్చుకెళ్లిన థార్!

నిద్రపోవడమే ఉద్యోగం.. 60 రోజులు నిద్రపోతూ రూ.9.6 లక్షలు సంపాదించిన యువతి

ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!

మోదీ పాలనపై సోనియా ఫైర్.. 1975 నాటి ఎమర్జెన్సీపై క్లారిటీ.. కేంద్రమంత్రులు స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

Advertisement
×