BigTV English

Dengue Deaths : భారత్‌కు డెంగ్యూ డేంజర్

Dengue Deaths : భారత్‌కు డెంగ్యూ డేంజర్
Dengue Deaths

Dengue Deaths : ఈ ఏడాది డెంగ్యూ మరణాలు అత్యధికంగా చోటుచేసుకున్న టాప్ 20 దేశాల్లో ఇండియా కూడా ఉంది. జనవరి-నవంబర్ నెలల మధ్య 20 దేశాల్లో 50 లక్షల కేసులు వెలుగుచూశాయని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ నివేదించింది.


2022లో కేసులతో పోలిస్తే ఇది 30% అధికం. 2019 లెక్కల ప్రకారం చూసినా 18% ఎక్కువే. భారత్ సహా డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్నటాప్ 20 దేశాల్లో 5500 మంది మరణించారు. 2019 నాటి మరణాలతో పోలిస్తే ఇది 11%, 2022 లెక్కలతో పోలిస్తే 32% అధికమని ఆ నివేదిక తేల్చింది.

వాస్తవ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్‌లోనే డెంగ్యూ మరణాలు ఈ ఏడాది ఎక్కువ. ఇప్పటివరకు 3 లక్షల మంది దీని బారిన పడ్డారు. నిరుడు డెంగ్యూ కేసులు 62 వేలు మాత్రమే.


బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది ఇంతగా విజృంభించిన డెంగ్యూ 1598 మందిని బలితీసుకుంది. వీరిలో 160 మంది చిన్నారులు ఉన్నారు. 2022తో పోలిస్తే మృతుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ఆసియా దేశాల్లో వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల డెంగ్యూ కేసులు ప్రబలాయి.

ముఖ్యంగా చిన్నారులపై డెంగ్యూ జ్వరాల ప్రభావం ఎక్కువగా పడింది. డెంగ్యూ కేసులు ప్రబలడానికి ఎల్ నినో కూడా కారణమేనని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గత రెండు దశాబ్దాల్లో డెంగ్యూ ముప్పు 8 రెట్లు పెరిగింది. 2000 సంవత్సరంలో 5 లక్షల కేసులు నమోదు కాగా.. 2022 నాటికి ఆ సంఖ్య 42 లక్షలకు పెరిగింది.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×