BigTV English

Ayodhya Ram mandir : అంతా రామమయం.. నగరమంతా పండగ శోభ..

Ayodhya Ram mandir : అంతా రామమయం.. నగరమంతా పండగ శోభ..

Ayodhya Ram mandir : అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మధ్యాహ్నం జరగనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినీతారలు, క్రీడాకారులు.. ఇలా చాలా మంది సెలెబ్రిటీలు వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్రాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మ భూమిలో రామలయ నిర్మాణం సుసాధ్యమైంది.


దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4 వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8 వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, నటులు, ఆర్మీ అధికారులు, ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చాంపత్ రాయ్ తెలిపారు. అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో రామ మందిర విశేషాలు కొన్ని చూద్దాం.

పురాణాలను అనుసరించి అయోధ్య కోసలరాజ్య రాజధాని.. సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి. ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19 శతాబ్దంలో మొదలైంది. అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది. 1980లలో విశ్వహిందూ పరిషత్, బీజేపి ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. తర్వాత పురావాస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు.


అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్‌ను రూపొందించి సొంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించినట్లు సమాచారం. సోమనాథ ఆలయం, చంద్రకాంత్ సోంపురా ఆలయాల ప్రధాన వాస్తు శిల్పి, అతడి ఇద్దరు కుమారులు ఆశిష్, నిఖిల్ సొంపురాకు సహాయకులుగా పనిచేశారు. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2వేల 587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు. ఝాన్సీ, బిథూరి, యమునోత్రి, హల్దీఘటి, ఛత్తోరోర్ఘడ్, గోల్డెన్ టెంపుల్… ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు.

అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటిమీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయల తరహాలో గుజారా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు.

రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయ్ లాండ్ నుంచి మట్టి వచ్చినట్లు సమాచారం. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయ్ లాండ్ లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు.. అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయ్ లాండ్‌లో నిర్మించారు.
ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్ పూర్ నుంచి గులాబి రంగు బన్సీపహార్ పూర్ సాండ్ స్టోన్ ను వివినయోంగిచారు.

ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడగులు, శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం మూడు అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువు వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×