Big Stories

Kamal Nath: ‘నేను చెప్పానా..?’ బీజేపీలో చేరికపై కమల్ నాథ్ స్పందన..

Kamal Nath

- Advertisement -

Kamal Nath reacts on joining BJP: మద్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలకు ఆయన తెరదించారు. నేను నా నోటితో చెప్పానా.. మీరు విన్నారా..? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా ..? అని మీడియాను ప్రశ్నించారు. మంగళవారం మధ్యపరదేశ్ లోని చింద్వారా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తల గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా ఆయన స్పందించారు.

- Advertisement -

పార్టీ మారుతున్నారని తనపై అనవసర వదంతులు సృష్టిస్తున్నారని కమల్ నాథ్ మండిపడ్డారు. నేను కాగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో ఐదు రోజుల పాటు కాంగ్రెస్ నేతలు పర్యటన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కార్యకర్తలు, పార్టీ అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

Read More: బాబా రామ్ దేవ్ కు సుప్రీంకోర్టు షాక్.. పతంజలిపై ధిక్కార నోటీసులు జారీ..

రాష్ట్రంలో వర్షాలు, వడగళ్ల వానల కారణంగా రైతులకు జరిగిన నష్టంపై కమల్ నాథ్ స్పందించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రిని డిమాడ్ చేస్తామన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోందని ఆయన విమర్శించారు. ఈ ప్రభుత్వం రుణాలతో నడుస్తోందని దుయ్యబట్టారు. లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలో అభ్యర్తులు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News