E-Paper
Advertisement

పశ్చిమాన భూప్రకంపనలు.. నాసిక్-సూరత్‌ ప్రాంతాల్లో బెంబేలెత్తిన ప్రజలు, రోడ్లపైకి పరుగులు

పశ్చిమాన భూప్రకంపనలు.. నాసిక్-సూరత్‌ ప్రాంతాల్లో బెంబేలెత్తిన ప్రజలు, రోడ్లపైకి పరుగులు
Advertisement

Earthquake: భూప్రకంపనలు సెగ ఇండియాను తాకుతున్నాయి. తాజాగా శనివారం రాత్రి మహారాష్ట్ర-గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో నమోదు అయ్యింది. ముఖ్యంగా నాసిక్-సూరత్- వాపిలలో భూమి కంపించినట్లు నివేదికలు వస్తున్నాయి.

 

దేశంలోని పశ్చిమ ప్రాంతంలో భూప్రకంపనలు

Advertisement

 

దేశంలోని గడిచిన కొన్నాళ్లుగా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నలుదిక్కులా వారంలో ఒకటి లేదా రెండుసార్లు ప్రకంపనలు వస్తున్నాయి. తాజాగా శనివారం రాత్రి మహరాష్ట్ర, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదు అయ్యింది.

Advertisement

 

రాత్రి నాసిక్-సూరత్‌ ప్రాంతాల్లో కంపించిన భూమి

 

సూరత్ నుంచి నాసిక్ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉన్నట్లు భూమి ఒక్కసారిగా వణకడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పారిపోయారు. నాసిక్‌తోపాటు సూరత్, వాపిల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జూలై వ్యాప్తంగా పశ్చిమ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల తర్వాత భూగర్భంలో పెరిగిన ఒత్తిడి వల్ల ఇలా జరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.

 

రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదు.. రోడ్లపైకి ప్రజలు పరుగులు

 

నాసిక్‌కు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాన్వాడ్ గ్రామంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు. నాసిక్ సిటీతోపాటు ఆ జిల్లాలోని దిండోరి, నిఫాడ్, పేఠ్, సుర్గానా, ఇగత్‌పురి భూమి కంపించింది. అంతకుముందు పేఠ్, సుర్గానా తాలూకాలలో మూడు స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. వాటికంటే ఈసారి ప్రకంపన తీవ్రంగా ఎక్కువగా ఉందని అంటున్నారు.

ALSO READ: ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్.. రూ.80,000 జీతం.. ట్రాయ్ విభాగంలో జాబ్స్

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ-NCSకి చెందిన ఓ అధికారి ఈ విధంగా చెప్పుకొచ్చారు. జూలైలో ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా భూమి కింద ఉన్న శిలల పగుళ్లలోకి నీరు చేరిందని, దాని కారణంగా ఒత్తిడి పెరిగి దక్కన్ పీఠభూమిలో భూమి కదలడానికి కారణమైందని అంటున్నారు.

ఈ మధ్యకాలంలో తక్కువ తీవ్రత గల భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని సూరత్, డాంగ్ జిల్లాలో రాత్రి 10 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అహ్వా, సక్రపతాల్, గల్కుండ్‌, సపుతారా ప్రాంతాల్లో భూమి కంపించింది. సపుతారాలోని పర్యాటకులు బస చేసే హోటళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

 

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×