E-Paper
Advertisement

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు
Advertisement

Uttar Pradesh: టెక్నాలజీ యుగంలో ట్రెండ్ మారింది.. ఆచారం-అలవాట్లు సైతం మారిపోతున్నాయి. కూతురు మనసులో ఎవరైనా ఉన్నారా? అనేది తెలుసుకోకుండా వివాహం చేస్తున్నారు తల్లిదండ్రులు. వివాహం జరిగిన కొద్దిరోజులకే కోరుకున్న ప్రియుడితో జెండా ఎత్తేస్తున్నారు నవ వధువులు. తాజాగా అలాంటి ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది.

యూపీలోని ఘాజియాబాద్‌లో అత్తింటికి షాకిచ్చిన కోడలు పిల్ల

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన వివరాల మేరకు.. కౌశాంబి ప్రాంతానికి చెందిన అభినవ్ ఖందేల్వాల్‌- రాణి మధ్య జులై 11న వివాహం జరిగింది. అభివన్ వాటర్ సప్లయర్‌గా పని చేస్తాడు. అభినవ్ తల్లి నిషా ఈ-రిక్షా నడుపుతుండగా, తండ్రి సంజయ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది మే నెలలో పొరుగున ఓ యువకుడు పానిపట్‌కు చెందిన రాణి అనే అమ్మాయితో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఇరుకుటుంబాలకు నచ్చడంతో సంబంధం కుదిరింది. జూలై 11న కౌశాంబి ప్రాంతంలో వివాహం ఘనంగా జరిగింది. రాణి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉంది. వివాహం సమయంలో ఎలాంటి కట్నకానుకలు తీసుకోలేదని అభినవ్ చెప్పాడు. సుమారు నాలుగు లక్షల రూపాయల పెళ్లి ఖర్చు అంతా తాము భరించామని తెలిపాడు.

వివాహం జరిగిన వారం నుంచే  ప్రియుడితో

Advertisement

పెళ్లైన వారం రోజుల్లో రాణి మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడడం గమనించాడు భర్త అభినవ్. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో మాట్లాడుతున్నానని ఓపెన్‌గా చెప్పింది భార్య. ఈ విషయం గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అవ్వలేదని భర్తతో చెప్పింది. దీంతో ఒక్కసారిగా భర్త అభినవ్ ఖంగుతిన్నాడు. ఈ వ్యవహారం కాస్త కుటుంబానికి చేరడంతో వివాదం తీవ్రమైంది. ఖంగుతిన్న భర్త అభినవ్, ఈ అంశంపై ఇరు కుటుంబాల మధ్య పెద్దలు పలుమార్లు మాట్లాడారు. ఈ క్రమంలో రాణి రాజస్థాన్‌లోని ఓ పుణ్యక్షేత్రం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఘజియాబాద్‌లోని తన అత్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మణికట్టు కోసుకుంటానని, గ్యాస్ సిలిండర్‌తో నిప్పంటించుకుంటానని బెదిరించినట్టు తెలుస్తోంది.

షాకైన భర్త కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు

జరుగుతున్న పరిణామాలు గమనించిన రాణిని అభినవ్ తల్లిదండ్రులను దూషించడంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని కాసింత ఆవేశంగా చెప్పారట. ఈ క్రమంలోనే పెళ్లైన 14 రోజులకే అంతా సర్దుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది రాణి. కాపురానికి తిరిగి రమ్మంటే తాను ప్రియుడ్ని వదిలి ఉండలేనని తేల్చి చెప్పేసింది. తన ప్రేమ విషయంలో జోక్యం చేసుకుంటే.. గృహ హింస కింద కేసు పెడతానని భర్తను భార్య బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేధింపుల కేసు పెడతామని తన కుటుంబాన్ని బెదిరించిందని చెప్పాడు అభినవ్. లక్ష రూపాయలు చెల్లించకపోతే కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరిస్తోందట. ఈ పరిణామాల నేపథ్యంలో అభినవ్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

ALSO READ: పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

Related News

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

Big Stories

Advertisement
×