E-Paper
Advertisement

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన
Advertisement

Jaipur Massive fire: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలాజీ మార్కెట్‌లో ఓ మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 లగ్జరీ కార్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాద తీవ్రతకు పొగలు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించాయంటే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జైపూర్‌ మెర్సిడెస్ షాప్‌లో అగ్నిప్రమాదం

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌‌లోని ఓ లగ్జరీ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాలాజీ మార్కెట్‌ లో ఓ మెర్సిడెస్ బెంజ్ వర్క్‌షాప్‌ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 లగ్జరీ కార్లు, ఖరీదైన విడిభాగాలు, ఇతర యాక్సెసరీలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రత కారణంగా 5 కిలోమీటర్ల దూరం వరకు దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటన గురించి సమాచారం తెలిసి వెంటనే పోలీసులు-అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 10 ఫైరింజన్ల సాయంతో రెండు గంటలపాటు శ్రమించారు.

మంటల్లో లగ్జరీ కార్లు దహనం, ఎలా జరిగింది?

Advertisement

చివరకు మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం సమయంలో వర్క్‌షాప్‌లో కొత్త-పాతవి కలిసి దాదాపు 50కి పైగా కార్లు ఉన్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో 8 కార్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మిగిలిన కార్లను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో భారీ నష్టం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు అధికారులు. ఘటన సమయంలో సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ALSO READ: పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

Advertisement

షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియాల్సివుంది. కాలిపోయిన వాహనాలు, విడిభాగాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం జైపూర్‌లోని నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలో ఓ మాల్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైరింజన్లు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related News

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

Big Stories

Advertisement
×