Fire incident Bus: గ్రేటర్ నోయిడా లోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై ట్రావెల్ బస్సులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులోని 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. అసలు ఘటన ఎలా జరిగింది? మిగతా ప్రయాణికులు పరిస్థితి ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జేవార్ విమానాశ్రయం దగ్గరలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు నోయిడా నుంచి మహోబాకు వెళ్తోంది. బస్సు మంటల్లో చిక్కుకుని ఉన్న సమయంలో అందులోని ప్రయాణికుల నుంచి ఒక్కసారిగా ఆర్తనాదాలు వినిపించాయి.
ఘటన గురించి తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేవార్ పోలీసులు, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 30 నుంచి 40 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
మంటలు చెలరేగిన తర్వాత వారిలో చాలామంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కిటికీల నుండి బయటకు దూకినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో చాలామంది గాఢమైన నిద్రలో ఉన్నారు. ఘటన గురించి తెలియగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ALSO READ: మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన
మృతుల కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందించాలన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాన్ని పక్కకు తీసి, ట్రాఫిక్ క్లియర్ చేశారు అధికారులు. ఈ ఘటన ఎలా జరిగింది? అనేదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
यमुना एक्सप्रेसवे पर डबल डेकर बस में भीषण आग 9 यात्रियों की दर्दनाक मौत
यात्रियों को बचाने के लिए पुलिस प्रशासन फायर टीम का घंटे तक चला रेस्क्यू सुरक्षित निकाला गया यात्रियों को 9 की गई जान#noida #bus #fire pic.twitter.com/GKzl3NNylH
— THOUGHT (@AnkitMa17093100) September 24, 2026