Chennai: తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోందా? కావాలనే కొందరు నేతలు వివాదాలు చేస్తున్నారా? హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోందా? మంత్రి ప్రకటనతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయా? అసలు ఏం జరిగింది?
తమిళనాడులోని ప్రభుత్వ విద్యార్థి హాస్టళ్ల మెనూలో బీఫ్ చేర్చే అంశం చర్చనీయాంశంగా మారింది. కొందరు విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తమిళనాడు సాంఘిక న్యాయ శాఖ మంత్రి వన్ని అరసు వెల్లడించారు. ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం చెన్నై సైదాపేటలోని ఓ హాస్టల్‌ను తనిఖీ చేశారు సదరు మంత్రి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్-మటన్ అందిస్తున్నామన్నారు. సోమవారం బిర్యానీ వడ్డిస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు.. మటన్ ధర ఎక్కువగా ఉందని తమ దృష్టికి తెచ్చారు. తమ ఇళ్లలో దాన్ని తినరని, దాని స్థానంలో బీఫ్‌ను చేర్చాలని కోరినట్లు సదరు మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.హాస్టల్ లో బీఫ్ వడ్డించే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. న్నాభిప్రాయాలు ఉండడంతో విద్యార్థులు-అధికారులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే విద్యార్థుల కోరిక మేరకు ఉప్మా-కిచిడీ తొలగించామని, వాటి స్థానంలో ఇడ్లీ-దోశ మెనూలో చేర్చామన్నారు.
హాస్టల్ లో బీఫ్ వడ్డించే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. న్నాభిప్రాయాలు ఉండడంతో విద్యార్థులు-అధికారులతో చర్చించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే విద్యార్థుల కోరిక మేరకు ఉప్మా-కిచిడీ తొలగించామని, వాటి స్థానంలో ఇడ్లీ-దోశ మెనూలో చేర్చామన్నారు. హాస్టళ్లలో బీఫ్‌ను చేర్చే అంశంపై పుతియ తమిళగం వ్యవస్థాపకుడు డాక్టర్ కె. కృష్ణస్వామి వ్యతిరేకత వ్యక్తం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు తగినంత ప్రోటీన్, విటమిన్లు, పోషకాలు ఉండే సమతుల్య ఆహారం అందించాలన్నారు. హాస్టల్ మెనూలో బీఫ్‌ను భాగంగా పరిగణించడాన్ని ఆయన వ్యతిరేకించారు.
ALSO READ: పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు
దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు, సామాన్యుల మధ్య తీవ్ర చర్చకు దారి తీసింది. ఓ వర్గం మంచిదే అంటుంటే, మెజార్టీవాళ్లు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని విజయ్ సర్కార్ ఎలా హ్యాండిల్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.