CCTV Captures Attack: కర్రలు, కత్తులతో కొట్టుకునేవారు.. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఏకంగా వాహనాలతో ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. డబ్బుల వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రాణాంతకంగా మారింది. ట్రాక్టర్‌తో యువకుడిని తొక్కేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో బయటపడింది.
రాజస్థాన్ రాజధాని జైపూర్ జిల్లా పింగున్ గ్రామంలోని పెట్రోల్ పంపు వద్ద బైక్‌పై వెళ్తున్న యువకుడ్ని.. ట్రాక్టర్ డ్రైవర్ ఢీ కొట్టడానికి ప్రయత్నించాడు మరొక వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయ్యింది. డబ్బుల వివాదం కారణంగా జరిగిన ఈ ప్రమాదం నుండి ఆ యువకుడు తృటిలో తప్పించుకున్నాడు, అయితే ఆ యువకుడి బైక్ పూర్తిగా ధ్వంసమైంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన సెప్టెంబర్ 20న సాయంత్రం 4.35 గంటలకు జరిగింది. పింగున్ గ్రామానికి చెందిన సురేష్ గుర్జర్ తన బైక్‌పై పెట్రోల్ ఫుల్ చేసేందుకు పంపు వద్దకు వచ్చాడు. బైక్ దిగి పక్కన నిలబడ్డాడు. అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన శైతాన్ గుర్జర్.. తన ట్రాక్టర్‌తో పెట్రోల్ పంపు వద్ద సురేష్‌ను చూశాడు. వెంటనే ట్రాక్టర్‌ను వెనక్కి తిప్పి సురేష్‌ను తొక్కించడానికి ప్రయత్నించాడు. ట్రాక్టర్ రాక గమనించిన సురేశ్, ప్రాణభయంతో పెట్రోల్ పంపు లోపలికి పరుగెత్తాడు. శైతాన్ గుర్జర్ ట్రాక్టర్.. బైక్‌పై నుంచి దూసుకెళ్లడంతో అది కాస్త ముక్కలైపోయింది. ఆ తర్వాత ట్రాక్టర్‌ను తీసుకుని పెట్రోల్ పంపు భవనం వరకు సురేష్‌ను వెంబడించాడు. కొద్దిసేపు తర్వాత ఎవరికివారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సురేష్ గుర్జర్. అతడి ఫిర్యాదు ఆధారంగా నారాయణ పోలీస్ స్టేషన్‌లో శైతాన్ గుర్జర్‌పై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు వ్యక్తులు ఒకే గ్రామానికి చెందినవారని తేలింది. కొంతకాలంగా డబ్బు లావాదేవీల విషయంలో వీరి మధ్య వివాదం నడుస్తోంది. సంఘటన జరగడానికి రెండు మూడు రోజుల ముందు గొడవ జరిగింది. అప్పుడు సురేశ్.. శైతాన్‌ను కొట్టాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే క్రమంలో ఉన్న శైతాన్, పెట్రోల్ పంపు వద్ద సురేష్‌ను చూడగానే వాహనంతో దాడి చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.
ALSO READ: వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Dudu, Jaipur Rural, Rajasthan: Tractor Driver Allegedly Tries to Run Over Customer at Petrol Pump
CCTV footage from a petrol pump in the Dudu area shows a man refuelling his motorcycle when a tractor suddenly moves toward him. The man appears to realise what is happening and… pic.twitter.com/ceZrpWJmbI
— Deadly Kalesh (@Deadlykalesh) September 22, 2026