E-Paper
Advertisement

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Supreme Court: వందేమాతరం గీతాలాపనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గేయంలోని ఎన్ని చరణాలు పాడాలన్నది పూర్తిగా పౌరుల వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వందేమాతం గేయంలోని ఆరు చరణాలను ఆలపించాని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ సంగీత విద్వాంసుడు టీ.ఎం.కృష్ణ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

వందేమాతర గీతంలోని చివరి నాలుగు చరణాల్లో హిందూ దేవతలను ఉద్దేశించిన అంశాలు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. వాటిని తప్పనిసరిగా పాడేలా చేయటం రాజ్యాంగంలోని లౌకిక విలువలకు విరుద్ధమని తెలిపారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా.. ఓ నిర్ధిష్ట మతపరమైన సందేశాన్ని ప్రోత్సహించేలా చట్ట సవరణ ఉందని ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

Advertisement

దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వందేమాతరం గీతంలోని అన్ని చరణాలు పాడని వారిపై చర్యలు తీసుకోలేరని స్పష్టం చేసింది. పూర్తి వందేమాతరం గీతాన్ని పాడని వారిపై కేంద్రం తీసుకునే చర్యల అంశాన్ని పరిశీలించేందుకు అంగీకరించింది. వందేమాతరం సవరణ చట్టం, మార్గదర్శకాలపై రెండు వారాల్లోనే సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

మరో కేసులో వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరుల హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎవరినైనా అరెస్టు చేసినపుడు దానికి గల కారణాలను లిఖితపూర్వకంగా అవతలి వ్యక్తికి అర్థమయ్యే భాషలో తప్పనిసరిగా తెలియచేయాలని పేర్కొంది. అలా చేయని పక్షంలో ఆ అరెస్టు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అవుతుందని తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1), ఆర్టికల్ 21 కింద పౌరులకు లభించిన ప్రాథమిక హక్కు అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్ ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Also Read: ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!

పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీ దళ్ నేత జస్​ కరణ్​ జీత్ సింగ్ డియోల్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన కేసులో ఈ తీర్పును వెలువరించింది. గత ఏడాది మే 17న పంజాబ్ పోలీసులు ఆయనను అరెస్టు చేసినపుడు కారణాలను లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించి అరెస్టును రద్దు చేసింది. ఈ నిబంధన కేవలం సాధారణ ఐపీసీ కేసులకే కాకుండా పోక్సో, పీఎంఎల్‌ఏ, ఉపా వంటి కఠినమైన ప్రత్యేక చట్టాల కింద చేసే అరెస్టులకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read: ఇలా ఉన్నారేంట్రా.. ట్రాక్టర్‌ని విప్పేసి ఇంజన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?

Tags

Related News

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×