E-Paper
Advertisement

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!
Advertisement

UPI MDR Charges: 2 వేల రూపాయల వరకు ఉన్న యూపీఐ మర్చంట్ చెల్లింపులకు ఎండీఆర్ పూర్తిగా జీరో. అంటే జీఎస్టీ భారం కూడా సున్నా. యూపీఐ ఛార్జీలపై జరుగుతున్న ప్రచారం.. కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. ఎండీఆర్‌పై జీఎస్టీ చిన్న వ్యాపారులపై భారం మోపుతుందన్న వార్తలు తప్పని కొట్టిపారేసింది. ఎండీఆర్ కేవలం రూ.2 వేల పైన ఉన్న పీ2ఎం లావాదేవీలకే వర్తిస్తుందని, రూ.2 వేల లోపు చెల్లింపులకు జీరో ఎండీఆర్, జీరో జీఎస్టీ ప్రభావమని తెలిపింది.

96% మందికి ఉచితమే!

Advertisement

ఇక్కడే అసలు లెక్క ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రూ.2 వేల లోపు లావాదేవీలే.. మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీల్లో 96 శాతానికిపైగా ఉన్నాయని స్పష్టం చేసింది. అంటే మెజారిటీ చెల్లింపులకు ఎండీఆర్‌గానీ, జీఎస్టీగానీ ఉండవు. ఎండీఆర్ చెల్లించిన వ్యాపారులకు కూడా ఊరటనిచ్చే విషయాన్ని తెలిపింది. ఎండీఆర్‌పై వ్యాపారి చెల్లించిన జీఎస్టీని, అమ్మకాలపై చెల్లించాల్సిన జీఎస్టీ నుంచి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా సర్దుబాటు చేసుకోవచ్చని వివరించింది. దీనివల్ల వ్యాపారులపై అదనపు భారం పడదని తెలిపింది. నెలకు లక్ష రూపాయల వరకు యూపీఐ రసీదులు పొందే వ్యాపారులకు.. అసలు ఎండీఆరే ఉండదు. అందుకే వారికి జీఎస్టీ సమస్య కూడా లేదు.

అక్టోబర్ 15 నుంచి మారుతోంది!

Advertisement

అక్టోబర్ 15 నుంచి 2 వేల పైన ఉన్న పీ2ఎం చెల్లింపులకు 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. ఈ చార్జీ వినియోగదారులు కాదు, వ్యాపారులు చెల్లించాలి. 75 వేలు, ఆపైన లావాదేవీలకు గరిష్టంగా రూ.300 వరకే ఛార్జీ పడుతుంది. పర్సన్ టు పర్సన్ చెల్లింపులు పూర్తిగా ఉచితం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ చార్జీ పన్ను, సెస్ కాదని స్పష్టం చేశారు. ఓపక్కన కేంద్రం అపోహలు వద్దంటుంటే.. మరోపక్క ఎండీఆర్ వెనుక విదేశీ ఒత్తిడి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా.. అక్టోబర్ 15 నుంచి కొత్త యూపీఐ రూల్స్ అమల్లోకి వస్తాయి.

Also Read: కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Tags

Related News

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

Big Stories

Advertisement
×