Delhi Elections : రాజధాని ప్రాంతమైన దిల్లీ అసెంబ్లీకి 2025 ఎలక్షన్ల షెడ్యూళ్ ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేజ్రివాల్ నేతృత్వంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని అధికార భాజపా మధ్య కొన్నేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. గతంలో దిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎదురులేకుండా పాలించిన కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల తేదీల ప్రకటనతో అన్ని పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన తేదీలు..
దిల్లీ అసెంబ్లీకి ఈనెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. పూర్తి వివరాలు అప్పుడు విడుదల చేయనున్నారు. కాగా.. ఫిబ్రవరి 5 న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఒకే విడుదలతో 70 స్థానాల దిల్లీ అసెంబ్లీకి ఒకేవిడుదలతో ఎన్నికల్ని ముగించనుంది. మూడురోజుల వ్యవధిలో ఫిబ్రవరిలో 8న కౌటింగ్ నిర్వహించి.. సాయంత్రం లోగా ఎన్నికల ఫలితాల్ని వెలువరించనున్నరు.
కాగా.. ఇప్పటికే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో మునిగిపోయింది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. పోరుకు సిద్ధం కాగా, ప్రధాని మోదీ సైతం వరుస ఎన్నికల సభలతో హడావిడిగా ఉన్నారు. పైగా.. ఆ పార్టీ యంత్రాంగం మొత్తం ఎలాగైనా దిల్లీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ రెండు పక్షాల మధ్య… కాంగ్రెస్ పార్టీ సైతం తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. స్థానికంగా బలమైన పార్టీ నిర్మాణం ఉన్న కాంగ్రెస్.. గతంలో వరుసగా మూడుసార్లు దిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మళ్లీ అలాంటి చరిత్రను సృష్టించేందుకు రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఈ నెల 10న నోటిఫికేషన్
ఫిబ్రవరి 5న పోలింగ్
ఫిబ్రవరి 8న కౌంటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి pic.twitter.com/2baPg0WdOP
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025