BigTV English

Tom Holland : ప్రియురాలితో సీక్రెట్ గా ‘స్పైడర్ మ్యాన్’ ఎంగేజ్మెంట్

Tom Holland : ప్రియురాలితో సీక్రెట్ గా ‘స్పైడర్ మ్యాన్’ ఎంగేజ్మెంట్

Tom Holland : ‘స్పైడర్ మ్యాన్’ స్టార్ కపుల్ టామ్ హాలండ్ (Tom Holland), జెండయా (Zendaya) సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. 2025 గోల్డెన్ గ్లోబ్స్‌లో జెండయా తన వేలికి ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్‌ తో కన్పించగా, ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో జెండయా అద్భుతంగా కనిపించింది. ఆమె ఈ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా ఎంపికైంది.


సమాచారం ప్రకారం ‘స్పైడర్ మ్యాన్’ స్టార్ టామ్ క్రిస్మస్ సందర్భంగా జెండయాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో జెండాయా కుటుంబం కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. టామ్ మోకాలిపై కూర్చొని, ఆమె కుటుంబం ముందు సినిమా స్టైల్ లో జెండయాకు ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె కూడా వెంటనే ఒకే చెప్పడంతో అక్కడిక్కడే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందట. నిజానికి ఈ జంట చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు.

గోల్డెన్ గ్లోబ్స్ 2025లో ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో…
82వ గోల్డెన్ గ్లోబ్స్‌లో జెండయా తన వేలికి పెద్ద డైమండ్ రింగ్ ధరించి కనిపించింది. కొన్ని గంటల తర్వాత జెండయా టామ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసింది. మెగా షో రెడ్ కార్పెట్ పై ఓ మీడియా రిపోర్టర్ ఆమెను రింగ్ గురించి ప్రశ్నించగా.. జెండాయ సూటిగా సమాధానం చెప్పలేదు. ఆమె సిగ్గు పడుతూ నవ్వి, భుజాలు ఎగరేస్తూ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో నిశ్చితార్థం జరిగిందనే పుకార్లు మొదలయ్యాయి. ఈ జంట తమ బంధం గురించి ఎప్పుడు బయట పెడతారా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. జెండయా – టామ్ హాలండ్ నిశ్చితార్థం గురించి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. 2022లో కూడా ఇలాగే వార్తలు రాగా, జెండయా స్పందిస్తూ తన నిశ్చితార్థం జరిగితే తప్పకుండా అందరికీ చెబుతానని చెప్పి ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.


‘స్పైడర్ మ్యాన్’ లో పరిచయం
జెండయా – టామ్ హాలండ్ మొదటిసారి 2016లో ‘స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్’ (Spider-Man: Homecoming) సెట్స్‌లో కలుసుకున్నారు. నాలుగు సంవత్సరాల తరువాత, ఈ జంట ఒక కార్యక్రమంలో ఫోటో గ్రాఫర్స్ ముందే ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. తరువాత టామ్, జెండాయ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. టామ్ హాలండ్ – జెండయా 2021 నుండి డేటింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా… ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ తర్వాత జెండయా – టామ్ హాలండ్ ఓ కొత్త ప్రాజెక్ట్‌లో మరోసారి కలిసి కనిపించబోతున్నారు. 2026లో విడుదల కానున్న క్రిస్టోఫర్ నోలన్ కొత్త చిత్రం ‘ది ఒడిస్సీ’లో కూడా ఈ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అన్నే హాత్వే, మాట్ డామన్, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, చార్లిజ్ థెరాన్ వంటి హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ మూవీలో భాగం కానున్నారు. జెండయా – టామ్ హాలండ్ నిశ్చితార్థం గురించి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. 2022లో కూడా ఇలాగే వార్తలు రాగా, జెండయా స్పందిస్తూ తన నిశ్చితార్థం జరిగితే తప్పకుండా అందరికీ చెబుతానని చెప్పి ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×