BigTV English

Lok Sabha Polls 2024: ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెడీ అవుతోన్న EC.. ఈ నెల 15న ప్రకటించే అవకాశం

Lok Sabha Polls 2024: ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రెడీ అవుతోన్న EC.. ఈ నెల 15న ప్రకటించే అవకాశం
Lok Sabha Polls 2024
Lok Sabha Polls 2024

Lok Sabha Polls 2024 Schedule: లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడానికి కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. మార్చి 15న ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. లోక్ సభ ఎన్నికలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పర్యటించారు.


నేడు ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కాపుంది. అటు సాధారణ పరిశీలకులతో, వ్యయ పరిశీలకులతో రాజధాని ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ నెల 12,13 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. 14న ఎన్నికల సన్నద్ధతపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించనేంది. ఈ సమీక్ష అనంతరం మార్చి 15న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

కాగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్ మధ్య విభేదాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. కేవలం వ్యక్తిగత కారణాలతోనే గోయల్ రాజీనామా చేసి ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ఈ నెల 15 లోపు ఎన్నికల కమిషనర్ల భర్తీ జరగనున్నట్లు తెలుస్తోంది.


Read More: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా.. లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్య పరిణామం..

గత ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే రాజీనామా చేశారు. ఇప్పుడు మరో ఈసీ అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో త్వరగా ఎన్నికల కమిషనర్ల భర్తీ పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×