BigTV English

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth reddy visits YadagiriguttaCM Revanth Reddy Visits Yadagirigutta(Latest news in telangana): నేడు యాదగిరిగుట్టను ముఖ్యమంత్రి రేవంత్ సందర్శించనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి యాదాద్రి వెళ్తున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక ఛాపర్‌లో సీఎం యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఇవాళ్టి నుంచి యాదగిరిగుట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 21 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.


ఆరుగురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి భద్రాచలం వెళ్లనున్నారు. అక్కడ రామయ్యను దర్శించుకోనున్నారు. ఆ తర్వాత భద్రాచలంలోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తదనంతరం భద్రాచలం సీతారామ ఆలయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం మణుగూరులో నిర్వహిస్తున్న బహిరంగసభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.


Related News

VC Sajjanar: హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లు బ‌దలీ..

Hyderabad Rains: జలదిగ్భందంలో హైదరాబాద్.. మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

Rain Update: ముంచుకోస్తున్న ముప్పు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

Big Stories

×