E-Paper
Advertisement

Election Commission: జమ్మూకాశ్మీర్ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఎప్పుడంటే..?

Election Commission: జమ్మూకాశ్మీర్ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఎప్పుడంటే..?
Advertisement

Election Commission: జమ్మూకాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు.. ఝార్ఖండ్, హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు 20 నాటికి ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది.

ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైనచోట కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ జూన్ 25 నుంచి ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పిస్తామని ఈసీ స్పష్టం చేసింది. జులై 25న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామని, ఆగస్టు 9 వరకు అభ్యంతరాలను స్వీకరించిన తరువాత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 20న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపింది.

Advertisement

కాగా, 2018లో జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రద్దు అయిన తరువాత నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూకాశ్మీర్ ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను ఈసీ ఆదేశించింది.

Also Read: నీట్ వివాదంపై స్పందించిన జైరాం రమేష్.. మోదీ సర్కార్‌పై ఫైర్

Advertisement

మరోవైపు హరియాణా అసెంబ్లీ గడువు నవంబర్ 11తో ముగియనున్నది. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26, ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు కూడా జనవరి, 2025తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో వారంరోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానున్నట్లు సమాచారం.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×