BigTV English

25 crores seized: నోట్ల కట్టలు, 25 కోట్ల రూపాయలు, ఎక్కడ?

25 crores seized: నోట్ల కట్టలు, 25 కోట్ల రూపాయలు, ఎక్కడ?

ED raid news today(Today latest news telugu): లోక్‌సభ ఎన్నికల వేళ దేశంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. కోట్లాది రూపాయలు, బంగారం పట్టుబడుతోంది. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో 25 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంత డబ్బు ఎక్కడిది? ఎలా వచ్చింది? అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే…


జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఉదయం అధికారులు పలుచోట్ల సోదాలు చేపట్టారు. ఓ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 25 కోట్ల రూపాయలను బయటపడడంతో అధికారులు షాకయ్యారు. ఓ కేసులో భాగంగా జార్ఖండ్ రూరల్ డెవలప్‌ శాఖలో పని చేశారు మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్రరామ్. ఆయన 2023లో అవినీతి ఆరోపణల కిందట అరెస్టయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ పలుచోట్ల సోదాలు చేపట్టింది.

ఈక్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌లాల్‌కు సహాయకుడిగా భావిస్తున్న ఓ ఇంట్లోని గది నిండా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ పథకాల అమలులో వీరేంద్రరాయ్ దాదాపు 100 కోట్ల రూపాయల నొక్కిశారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి పలువురు రాజకీయ నేతలతో ఆయన జరిపిన లావాదేవీల వివరాలతో కూడా సమాచారం ఇదివరకే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఆధారంగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఇందులో ఇంకెన్ని తిమింగళాలు బయటపడతాయో చూడాలి.


ALSO READ: ఏది ఏమైనా స్మృతి ఇరానీని ఓడించి తీరుతా’

అసలే దేశంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరింది. నేతలకు సంబంధించి ఏ చిన్న సమాచారం బయటకు వచ్చినా నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. జార్ఖండ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది బీజేపీ. రాష్ట్రంలో అవినీతి ఇంకా పూర్తి కాలేదని, దొరికిన డబ్బును ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో నేతలు ఉన్నారని దుయ్యబట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు చేపట్టాలన్నది జార్ఖండ్ కమలనాధుల డిమాండ్.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×