BigTV English

Priyanka Chopra – Nick Jonas: బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ప్రియాంక చోప్రా భర్త.. ఆ వ్యాధి కారణంగానే..

Priyanka Chopra – Nick Jonas: బెడ్‌పై నుంచి లేవలేని స్థితిలో ప్రియాంక చోప్రా భర్త.. ఆ వ్యాధి కారణంగానే..

Priyanka Chopra husband Nick Jonas Health(Bollywood celebrity news): బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా అంటే తెలియనివారుండరు. ఎన్నో సినిమాల్లో తన అందం, యాక్టింగ్, యాక్షన్ సీన్లతో సినీ ప్రియుల్ని అలరించింది. ఇక బాలీవుడ్‌లో మంచి స్టార్డమ్ ఉన్న టైంలో హాలీవుడ్‌కి మకాం మార్చింది. అక్కడ కూడా సినిమాల్లో నటించడంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది. దీంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన తొలి భారతీయ నటిగా ప్రియాంక పేరు సంపాదించుకుంది.


అయితే అదే టైం అక్కడ ఫేమస్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లు ప్రేమాయణం చేసిన ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరికి ఓ కూతురు మల్తీ ఉంది. కాగా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌కు అక్కడ మంచి పాపులారిటీ ఉంది. అతడే కాదు.. అతడి సోదరులు కూడా మంచి పాప్ సింగర్‌లే. అందువల్ల సొంతంగా వారే ఒక మ్యూజిక్ బాండ్ రన్ చేసుకుంటున్నారు. దానికి జోనస్ బ్రదర్స్ అనే పేరు కూడా పెట్టారు.

తరచూ మ్యూజిక్ కాన్సెర్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న నిక్ జోనస్.. తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు తాను ఇన్‌ఫ్లుఎంజా-A అనే వ్యాధి బారిన పడ్డానని.. దీని కారణంగా తాను గత మూడు రోజులు బెడ్‌ పైనే ఉన్నానని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు.


Also Read: మన్నారా చోప్రా బర్త్ డే వేడుకల్లో ప్రియాంక చోప్రా – నిక్ జోనస్.. వీడియో వైరల్

ఈ మేరకు ఓ నోట్ రాశాడు.. ‘‘హాయ్ గాయ్స్. నేను ఇన్‌ఫ్లుఎంజా-A అనే వ్యాధితో బాధపడుతున్నాను. ప్రస్తుతానికి నేను పాడలేకపోతున్నాను. నా గొంతు కోల్పోయాను. రెండు రోజుల నుంచి మాట్లాడలేకపోతున్నాను. ఒక రోజు మొత్తం జ్వరంతో చాలా ఇబ్బంది పడ్డాను.

తీవ్ర జ్వరం, తలనొప్పి, గొంతి నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. వెంటనే డాక్టర్‌ని సంప్రదించగా.. అతడు రెస్ట్ తీసుకోవాలని అన్నారు. అందువల్ల ప్రస్తుతం నేను చేయాల్సిన షోస్ అన్నీ ఆగస్టు నెలకి రీ షెడ్యూల్ చేశాం. మేము ఎల్లప్పుడూ మీకు అత్యుత్తమమైన ప్రదర్శనను అందించాలని కోరుకుంటున్నాము. కానీ ఇలాంటి సమయంలో నేను అలా చేయలేను. ఇది మీలో కొందరికి కలిగించే అసౌకర్యానికి చాలా చింతిస్తున్నాము’’ అంటూ రాసుకొచ్చాడు.

?utm_source=ig_web_copy_link">

దీంతో అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రీ షెడ్యూల్ వివరాలను కూడా వెల్లడించాడు. ప్రస్తుతం జరగాల్సిన మ్యూజిక్ కాన్సెర్ట్ ఆగస్టులో ప్రదర్శించనున్నట్లు తెలిపాడు. అందులో మెక్సికో సిటీలో ఆగస్టు 21, 22న.. అలాగే మాంట్రెర్రేలో ఆగస్టు 24, 25న జరపనున్నట్లు తెలిపాడు

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×