Big Stories

Amethi: ‘ఏది ఏమైనా స్మృతి ఇరానీని ఓడించి తీరుతా’

Amethi Congress MP Candidate KL Sharma: ఏది ఏమైనా సరే అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయం మేరకు తాను అమేథీలో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను స్వచ్ఛమైన రాజకీయ నాయకుడినని కేఎల్ శర్మ అన్నారు. తాను 1983లో యూత్ కాంగ్రెస్ ద్వారా అమేథీకి వచ్చినట్లు కేఎల్ శర్మ తెలిపారు. అయితే, తాను స్మృతి ఇరానీని ఓడించడం మాత్రం ఖాయమని, ఇది తాను చేస్తున్న పెద్ద ప్రకటన అంటూ కేఎల్ శర్మ చెప్పుకొచ్చారు. ఇక్కడి ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

అయితే, ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించారు. అనూహ్యంగా కేఎల్ శర్మ పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. లుథియానాకు చెందిన కేఎల్ శర్మ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా 1983లో రాజీవ్ గాంధీతో కలిసి పనిచేస్తున్న క్రమంలో ఆయన అమేథీకి వచ్చారు. రాజీవ్ గాంధీ, కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి కేఎల్ శర్మ పని చేశారు.

- Advertisement -

1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ పోటీ చేసినప్పుడు కేఎల్ శర్మ కీలకంగా పని చేసి పార్టీ గెలుపునకు ఎంతో కృషి చేశారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న అతడికి కొద్ది కాలం తరువాత రాయ బరేలీ బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలకు ఆయన ఇన్ చార్జిగా పని చేశారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి అతనికి అధిష్టానం కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన అమేథీ ఎంపీ టికెట్ ను ఆయనకు కేటాయించింది.

2019 ఎన్నికల్లో అమేథీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆమె 55 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా ఆమె బరిలో నిల్చున్నారు. ఎలాగైనా ఈసారి కూడా అమేథీ ఎంపీ సీటును తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా తమకు కంచుకోటలా భావించే అమేథీ సీటు పోయినసారే మిస్సయ్యింది.. ఈసారి ఎలాగైనా సరే గెలవాలన్న ఆకాంక్షతో పనిచేస్తుంది.

ఈ క్రమంలోనే అధిష్టానం ఎంపీ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో ఆలస్యమైనా, సరైనా అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించింది. ఆ తరువాత కేఎల్ శర్మను బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్థానాన్ని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తారని మొదటగా ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా కేఎల్ శర్మ పేరు తెరపైకి వచ్చింది.

Also Read: ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..?: ప్రియాంకా గాంధీ!

అమేథీలో ఆయనకు మంచిపట్టు ఉండడం, తాను లుథియానా నుంచి వచ్చినప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్న కారణంగా ఆయనకు స్థానికంగా పార్టీలో మంచి గుర్తింపు ఉండడం.. ఇటు అధిష్టానం వద్ద కూడా మంచి గుర్తింపు ఉండడం ఆయనకు కలిచి వచ్చే అవకాశాలుగా భావిస్తున్నారు. ఇటు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి బరిలో నిలుచుండడంతో ఇక్కడ ఈసారి పోటీ కీలకంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News