BigTV English

8th time ED notice to Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. ఎనిమిదోసారి!

8th time ED notice to Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు.. ఎనిమిదోసారి!

Arvind Kejriwal


ED Notices to Delhi Cm Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎనిమిదోసారి సమన్లు ఇచ్చింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ కోరింది.

ఢిల్లీ మద్య పాలసీ కేసులో గతంలో ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన సమయంలో  కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. దీంతో మరోసారి ఈడీ.. ఢిల్లీ సీఎంకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటుసులపై అరవింద్ కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఈసారైనా విచారణకు హాజరవుతారా లేదా అనేద ఉత్కంఠ నెలకొంది.


ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్‌ వ్యవహారంపై విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఏడోసారి నోటీసులు ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ఈక్రమంలోనే మంగళవార 8వ సారి ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు నవంబర్‌ 2న ఈడీ తొలిసారిగా నోటీసులు ఇచ్చింది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణకు హాజరుకాలేదు. అప్పటి నుంచి క్రమతప్పకుండా ఒక నోటీసు గుడువు ముగియగానే మరోసారి సమన్లు ఇస్తోంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసు న్యాయస్థానంలో నడుస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. ఈ సమయంలో ఈడీ తనకు నోటీసులు పంపడంపై అభ్యంతర తెలుపుతున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు.

నోటీసులు ఇచ్చినా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంపై ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఆయన ‌ వీడియో కాన్ఫరెన్స్‌ ఈ విచారణకు హాజరయ్యారు. కేజ్రీవాల్ విజ్ఞప్తితో విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×