BigTV English

Sindhu Moosewala: తల్లి కాబోతున్న సిద్దూ మూసేవాల తల్లి.. 58ఏళ్ల వయస్సులో జన్మినివ్వబోతున్న చరణ్ కౌర్

Sindhu Moosewala: తల్లి కాబోతున్న సిద్దూ మూసేవాల తల్లి.. 58ఏళ్ల వయస్సులో జన్మినివ్వబోతున్న చరణ్ కౌర్

 Sindhu Moosewala


Sindhu Moosewala Mother is Pregnant at age of 58: దివంగత పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు త్వరలోనే తమ కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆయన తల్లి చరణ్ కౌర్ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆయన కుటుంబ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించారు.

ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా 2022మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. మాన్నా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా దుండగులు తుఫాకీతో కాల్చి చప్పారు. అయితే అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


సిద్దూ మూసేవాలా తన తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన వారు వృద్దాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎస్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే మార్చిలో ఆమె తన బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం . గత కొన్ని నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రసుత్తం కౌర్ వయస్సు 58 సంవత్సరాలు కాగా. సిద్దూ తండ్రి బాల్ కౌర్ సింగ్ వయస్సు 60 ఏళ్లు.

Read More: మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధం.. మహాలక్ష్మి పథకానికి జీవో జారీ

సిద్దూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్ దీప్ సింగ్ సిద్దూ.. 2021 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మన్నా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పాడిన ’47’, “బంబిహ బోలే” పాటు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. మోసా జట్, తేరీ మేరీ జోడి, వంటి చిత్రాల్లో నటించారు సిద్దూ. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో సిద్దూ తండ్రి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం .

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×