BigTV English

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

Eight coaches of Terminus Express derail in Assam: అసోంలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అగర్తలా నుంచి ముంబై వెళ్తున్న ఈ రైలు దిమా హసావో జిల్లాలోని దిబలోంగ్‌ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం కలగలేదని వివరించారు.


వివరాల ప్రకారం.. అగర్తల నుంచి ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్(12520) పట్టాలు తప్పింది. గురువారం సాయంత్రం 4 గంటలకు డిమా హసావో జిల్లాలోని దిబ్లాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఇంజిన్‌, పవర్‌ కార్‌‌తో పాటు ఎనిమిది కోచ్‌‌లు పట్టాలు తప్పాయని వెల్లడించారు.

ఈ రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదని రైల్వే అధికారులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ రైలు ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంతో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. లుమ్ డింగ్- బాదర్ పూర్ సింగిల్ – లైన్ హిల్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు.


Also Read: వరదల్లో అవేం పనులు.. తలపట్టుకుంటున్న అధికారులు.. ప్లీజ్ ఆ ఒక్క పని చేయండంటూ..

ఈ ప్రమాదం జరిగిన వెంటనే పైలెట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే రైలు ప్రమాద వివరాలు, ప్రయాణికుల క్షేమ సమాచారం కోసం హెల్ప్‌ లైన్‌ నంబర్లు 03674 263120, 03674 263126 సంప్రదించాలని అధికారులు సూచించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×