BigTV English

Champai Soren: జార్ఖండ్‌లో కొత్త పార్టీ.. మాజీ సీఎం చంపయీ సోరెన్.. ఎవరికి అడ్వాంటేజ్

Champai Soren: జార్ఖండ్‌లో కొత్త పార్టీ.. మాజీ సీఎం చంపయీ సోరెన్.. ఎవరికి అడ్వాంటేజ్

Champai Soren new party updates(Telugu news live today): శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు పురుడు పోసుకోవడం సహజం. ఏ రాష్ట్రంలోనైనా ఒకటీ లేదా రెండు పుట్టుకొస్తాయి. తాజాగా జార్ఖండ్‌లోనూ అదే జరగబోతోంది. జేఎంఎం పార్టీలో సీనియన్ నేతగా పేరుపొందిన మాజీ సీఎం చంపయీ సోరెన్ కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు.


అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జార్ఖండ్‌లో రాజకీయ పరిమాణాలు వేగంగా మారిపోతున్నాయి. జేఎంఎం సీనియర్ నేతగా పేరుపొందిన మాజీ సీఎం చంపయీ సోరెన్, ఆ పార్టీకి రాంరాం చెప్పేశారు. మాజీ సీఎం అయిన తర్వాత పార్టీలో ఆయనకు పెద్దగా ప్రయార్టీ లేదన్నది అసలు కారణం. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు అంతర్గత సమాచారం.

జేఎంఎంతో విబేధించిన ఆయన, నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తొలుత బీజేపీలో ఆయన చేరుతారని వార్తలు వచ్చాయి. కాకపోతే వేరే పార్టీ పెడితే బీజేపీ గెలుపు సునాయాశమవుతుందన్న సంకేతాలు బలంగా వినిపించడంతో కొత్త పార్టీకి ఆయన శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.


ALSO READ:  రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..ఇక నుంచి మిల్లెట్స్, పాల ఉత్పత్తులు!

జార్ఖండ్‌లో కొత్త పార్టీ పెడతానన్న చంపయీ సోరెన్, పార్టీని గెలిపించే సత్తా ఉందా? అంటే చెప్పడం కష్టమే. గతంలో చాలామంది సీనియర్ అక్కడ పార్టీని పెట్టి, దాన్ని కొనసాగించలేక మిగతా పార్టీల్లో కలిసిపోయిన సందర్భాలు లేకపోలేదు. జార్ఖండ్ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో మాజీ సీఎం శిబుసోరెన్‌‌తో ఆయనకు అనుబంధం ఉంది.

సరాయ్‌కెలా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఆయన సొంతం. ఖర్‌సాంపా జిల్లాలో సోరెన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉండడంతో అధికార పార్టీకి ఝలక్ తగులుతుందన్నది ప్రత్యర్థి పార్టీల మాట. చంపయీ రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆ జిల్లా ప్రజల్లో ఆయనకు అభిమానం ఉందిగానీ, ఓట్ల రూపంలో ఎంతవరకు కలిసి వస్తుందన్నది అసలు పాయింట్.

రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎక్కువ సీట్లు సాధించుకోవాలని భావిస్తున్నారట మాజీ సీఎం చంపయీ సోరెన్. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే, తనకు సరైన ప్రయార్టీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకోసమే పార్టీ పెట్టడానికి మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

జార్ఖండ్ రాజకీయాల్లో టైగర్‌గా పేరు పొందిన చంపయీ సోరెన్‌కు కాలం కలిసి వస్తుందా? అనేది చూడాలి. తనకు చాలామంది మద్దతు ఉన్నారంటూనే, తన లైఫ్‌లో కొత్త అధ్యాయమని చెప్పుకొచ్చారు. ప్రయాణంలో మంచి మిత్రుడు కలిస్తే.. వారితో కలిసి ముందుకెళ్తానని మనసులోని మాట బయటపెట్టారు.

 

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×