E-Paper
Advertisement

తెలంగాణ యంగ్ క్రికెటర్లకు భారీ గుడ్ న్యూస్..?

తెలంగాణ యంగ్ క్రికెటర్లకు భారీ గుడ్ న్యూస్..?
Advertisement

Under 16 Cricket: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీ నుంచి అండర్-16 రాష్ట్ర స్థాయి క్రికెట్ లీగ్ ఫేజ్-1 పోటీలు ప్రారంభం కానున్నట్టు టీసీఏ ప్రధాన కార్యదర్శి ధారం గురువా రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎన్కేపల్లి వన్ ఛాంపియన్ గ్రౌండ్స్‌ లో పరిమిత ఓవర్ల విధానంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు.

ధారం గురువా రెడ్డి..

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించి, వారికి తగిన అవకాశాలు కల్పించడమే టీసీఏ ప్రధాన లక్ష్యమని ధారం గురువా రెడ్డి పేర్కొన్నారు. ఫేజ్-1 పోటీల్లో మొత్తం 16 జిల్లాల జట్లు పాల్గొననున్నాయన్నారు. వీటిని గ్రూప్-ఏ, గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి అనే నాలుగు గ్రూపులుగా విభజించినట్టు తెలిపారు. తొలి దశ పోటీలను రెండు విడతలుగా నిర్వహించనున్నట్టు చెప్పారు.

మూడు విడతలు..

Advertisement

మొదటి విడత నవంబర్ 11 నుంచి 13 వరకు గ్రూప్-ఏ, గ్రూప్-బి జట్ల మధ్య పోటీలు ఉంటాయన్నారు. రెండవ విడత నవంబర్ 17 నుంచి 19 వరకు గ్రూప్-సి, గ్రూప్-డి జట్ల మధ్య పోటీలు జరుగుతాయన్నారు. ఈ రెండు విడతల్లో ప్రతిరోజూ మ్యాచ్‌ లు నిర్వహించనున్నట్టు తెలిపారు. టోర్నమెంట్ రెండవ దశ (ఫేజ్-2) పోటీలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

Also Read: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని షాక్.. ఇద్దరు మాజీ ఎంపీల ఓటమి, ఎక్కడెక్కడ?

Tags

Related News

అమెరికాలో జగిత్యాల యువకుడు అనుమానాస్పద మృతి..!

గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

Big Stories

Advertisement
×