E-Paper
Advertisement

2026లో కొరియర్లో వచ్చిన పుస్తకంలో 1999 నాటి మర్డర్ మిస్టరీ… ఇదెలా సాధ్యం భయ్యా

2026లో కొరియర్లో వచ్చిన పుస్తకంలో 1999 నాటి మర్డర్ మిస్టరీ… ఇదెలా సాధ్యం భయ్యా
Advertisement

Telugu Crime Thriller Movie: 2026లో చేతికి వచ్చిన ఓ పుస్తకం… కానీ అందులో ఉన్న కథ మాత్రం 27 ఏళ్ల క్రితం జరిగిన ఓ డబుల్ మర్డర్‌కు సంబంధించినది. అసలు ఆ పుస్తకం ఎవరు పంపించారు ? 1999లో జరిగిన ఆ హత్యల వెనుక ఉన్న నిజం ఏంటి ? ఇన్నేళ్ల తర్వాత ఆ కేసు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది ? ఒక్కో క్లూకు సమాధానం వెతుకుతున్న కొద్దీ కొత్త అనుమానాలు పుట్టించే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ (Newton’s 3rd Law). మరి 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆ పాత కేసుకు ఇప్పటి ఘటనలకు సంబంధం ఏంటి? అసలు ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

1999లో జరిగిన ఓ డబుల్ మర్డర్‌తో కథ మొదలవుతుంది. ఒకే ఘటనలో ఇద్దరు హత్యకు గురవుతారు. ఆ హత్యలు ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా ? అనే ప్రశ్నలకు అప్పట్లోనే సమాధానాలు దొరకవు. కాలం గడిచేకొద్దీ ఆ కేసు కూడా దాదాపుగా మరుగున పడిపోతుంది. అయితే 27 ఏళ్ల తర్వాత ఈ పాత హత్యలకు సంబంధించిన ఓ పుస్తకం బయటకు రావడంతో కథ మళ్లీ మొదలవుతుంది. ఆ పుస్తకం ఎవరు పంపించారు ? అందులో 1999లో జరిగిన హత్యలకు సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి ? గతంలో మూసుకుపోయిన కేసుకు, ఇప్పుడు బయటపడుతున్న క్లూకు సంబంధం ఏంటి ? అనే ప్రశ్నలతో ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.

Advertisement

కేసు ముందుకు వెళ్లేకొద్దీ ఒక్కో నిజం బయట పడుతుంది. కానీ ప్రతి సమాధానం మరో ప్రశ్నను తెరపైకి తీసుకొస్తుంది. ఒకప్పుడు దాచిన నిజాలు, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పులు… ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ప్రస్తుత జీవితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ కథ కేవలం ఓ పాత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు. గతం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన వ్యక్తులను అదే గతం ఎలా వెంటాడిందనేది కూడా చూపిస్తుంది. సుమంత్ పోషించిన పాత్రతో పాటు జగపతి బాబు, శ్రీనివాస అవసరాల, రవివర్మ తదితర పాత్రలు ఈ మిస్టరీలో కీలకంగా మారతాయి.

ఎవరు నిజం కోసం వెతుకుతున్నారు? ఎవరు నిజాన్ని దాచాలని చూస్తున్నారు? 1999లో జరిగిన హత్యలకు అసలు కారణం ఏంటి? అనే విషయాలు క్రమంగా బయట పడతాయి. చివరికి 27 ఏళ్ల క్రితం ముగిసిపోయిందనుకున్న కేసు మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది ? ఆ పాత హత్యల వెనుక ఉన్న అసలు నేరస్థుడు ఎవరు ? ఇన్నేళ్లుగా అందరూ నమ్మిన కథ నిజమేనా ? లేక అసలు నిజాన్ని ఎవరో కావాలనే దాచారా ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా అసలు కథ.

ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు ?

Advertisement

రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌లో సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస అవసరాల, రవివర్మ, త్రినాథ్ వర్మ, నేహా పఠాన్ తదితరులు నటించారు. సుమారు 2 గంటల 18 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాలో మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, రివెంజ్, సీక్రెట్స్ వంటి అంశాలే కథను నడిపిస్తాయి. 2026 జూలై 31న థియేటర్లలో విడుదలైంది. సమాచారం ప్రకారం ETV Win ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. 27 ఏళ్ల క్రితం జరిగిన డబుల్ మర్డర్… దాన్ని మళ్లీ కదిలించిన ఓ పుస్తకం… ఒక్కో క్లూతో పెరుగుతున్న అనుమానాలు… మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా ఒక డిఫరెంట్ క్రైమ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.

Read Also: పిల్లాడు చెప్పే చిన్న అబద్ధం… ఏలియన్స్ ఎంట్రీతో భారీ సమస్య… ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ కేక

Tags

Related News

ఏడేళ్లుగా కనిపించని ప్రేయసి… ఆమె ఆచూకీ చెప్పే మాంత్రిక జీవులతో ప్రయోగం… ఓటీటీలోకి వచ్చిన వింత సిరీస్

బంగారం కోసం సముద్రంలో ప్రాణాంతక వేట… నిధి కోసం నిలువునా ముంచేసే కన్నింగ్ గాళ్ళు… ఊపిరి బిగబట్టి చూడాల్సిన అడ్వెంచర్ థ్రిల్లర్

చిన్ననాటి స్నేహితుల ముసుగులో ద్రోహం… ప్రపంచాన్ని కాపాడేందుకు ప్రాణాలకు తెగించే ఏజెంట్… జాన్ సీనా యాక్షన్ అడ్వెంచర్

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

Big Stories

Advertisement
×