E-Paper
Advertisement

జాయ్ రైడ్‌లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!

జాయ్ రైడ్‌లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!
Advertisement

Joy Ride Accident: మహరాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. జాంఖేడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిమిషన్ లో సునామీ జాయ్ రైడ్ ఎక్కిన ఓ యువతి.. ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో అప్పటివరకూ ఎగ్జిమిషన్ లో సంతోషంగా గడుపుతున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జాంఖేడ్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన ‘సునామీ కార్నివాల్ రైడ్’ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైడ్ వేగంగా తిరగడం ప్రారంభం కాగానే.. యువతి కూర్చున్న సీటుకు ఉన్న ఐరన్ సేఫ్టీ లాక్ ఉన్నట్టుండి ఊడిపోయింది. దీంతో ఒక్కసారిగా యువతి గాల్లోకి ఎగిరి అమాంతం కిందపడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

యువతి పరిస్థితి ఎలా ఉందంటే?

అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గాయాల పాలైన యువతిని హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎత్తు నుంచి కింద పడటం వల్ల ఆమె శరీరానికి తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా రైడ్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

కఠిన చర్యలకు డిమాండ్

అయితే స్థానిక జాతరలు, మేళాల సమయంలో ఇలాంటి జాయ్‌రైడ్లు సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే సరైన నిర్వహణ, అధికారుల తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.

Also Read: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు.. పట్టించుకోని అధికారులు

Tags

Related News

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×