E-Paper
Advertisement

పాట్నాలో భగ్గుమన్న విద్యార్థులు.. BPSC అక్రమాలపై సమరం.. ఉద్రిక్తంగా మారిన సీఎం ఇంటి ముట్టడి!

పాట్నాలో భగ్గుమన్న విద్యార్థులు.. BPSC అక్రమాలపై సమరం.. ఉద్రిక్తంగా మారిన సీఎం ఇంటి ముట్టడి!
Advertisement

Bihar Protests: ఢిల్లీ, జార్ఖండ్ తరహాలో బిహార్ లోనూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాజధాని పాట్నాలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీహార్ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయత్నించడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

రాళ్లు రువ్విన విద్యార్థులు

తొలుత పాట్నాలోని గాంధీ మైదాన్ నుంచి ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన.. డాక్ బంగ్లా కూడలికి చేరుకునేసరికి చేయిదాటింది. వేలాది మంది అభ్యర్థులు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. మరోవైపు విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో సీఆర్‌పీఎఫ్, ఆర్‌ఎఫ్‌ బలగాలు విద్యార్థులను అడ్డుకోవడంలో నిమగ్నమయ్యాయి.

Advertisement

విద్యార్థుల ప్రధాన డిమాండ్లు ఇవే

పాట్నాలోని గర్దానీబాగ్ ప్రాంతంలో గత కొన్ని వారాలుగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులు.. పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. టీచర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ (TRE 4.0)ను ఒకే విడత పరీక్షగా నిర్వహించాలని, నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే 70వ BPSC పరీక్షల్లో తీవ్ర అక్రమాలు, పేపర్ లీకేజీలు జరిగాయని, వెంటనే ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతున్నారు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ (SI) నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని హిందీ మీడియం విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ తీరుపై విపక్షాల ఆగ్రహం

Advertisement

గత 9 రోజులుగా అభ్యర్థులు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని బిహార్ లోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరికు లేఖ రాశారు. విద్యార్థుల డిమాండ్లను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరారు. కాగా ఆర్‌జేడీతో పాటు దాదాపు 14 విద్యార్థి, యువజన సంఘాలు ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచాయి.

Also Read: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ.. జడ్జీల ప్యానెల్‌పై పడ్డ రోబో.. స్ట్రెచ్చర్‌పై తరలింపు!

ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు

ఆందోళనలు ముదురుతుండటంతో బీహార్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. ప్రతినెల నాలుగో మంగళవారం విద్యాసంస్థల్లో ‘విద్యార్థి సహయోగ్ శివిర్’ (విద్యార్థుల సహాయక క్యాంపులు) నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్యాంపుల ద్వారా అభ్యర్థులు నేరుగా అధికారులకు తమ ఫిర్యాదులను అందజేయవచ్చని.. అలాగే ఆన్‌లైన్ పోర్టల్, హెల్ప్‌లైన్ నంబర్ 1100 ద్వారా కూడా ట్రాక్ చేయవచ్చని తెలిపారు.

Also Read: Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

Tags

Related News

భారత్‌కు అసలు బాస్ అంబానీయేనా? – ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్లు!

ఎలక్షన్ కమిషన్ రచ్చ వేళ.. చెన్నైలో విజయ్‌తో రాహుల్ కీలక సమావేశం!

రాష్ట్రపతి భవన్‌ భేటీతో మారిన పొలిటికల్ గేమ్‌.. ఓటు చోరీకి రాహుల్ ఇస్తున్న ఆధారాలేంటి?

మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

‘ఎంతమందిని అరెస్ట్ చేస్తారా.. చేసుకోండి’! .. కేంద్రానికి రాహుల్ గాంధీ ఓపెన్ ఛాలెంజ్

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

Big Stories

Advertisement
×