E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్

ఈశ్వర్ సాయి మాటలు నమ్మొచ్చా? మాధురి వివాదంలో కొత్త డౌట్స్
Advertisement

Eshwar Sai: ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వివాదం అటు తెలుగు రాష్టాలతో పాటు, ఇటు ఫోక్ ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తుంది.ఇక ఇప్పటి వరకు జానపదాలని నెత్తిన పెట్టుకున్న ఎంతో మంది అభిమానులు ఇపుడు ఫోక్ ఇండస్ట్రీ పై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి.ఫోక్ ఇండస్ట్రీ అంటే కమిట్ మెంట్ లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

ఇక ఈ వ్యవహారంపై అటు ఎంతో మంది ఫోక్ ఇండస్ట్రీకి సంబందించిన కళాకారులు మీడియా ముందుకు వచ్చి ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం వారి వ్యక్తిగతమని,దానికి ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు కూడా.

అపుడు ఓపెన్ గా చెప్పేసి

Advertisement

ఈ వ్యవహారం అటు ఫోక్ ఇండస్ట్రీలో ,ఇటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుండగా అజ్ఞాత వాసంలో ఉన్న ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.అసలు తాను ఎక్కడివాడినని, ఫోక్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానని, మాధురి రాథోడ్ తో పరిచయం ఎలా ఏర్పడిందన్న విషయాలని అన్నీ ఓపెన్ గా చెప్పేసి చేసిన తప్పుకి క్షమించమని వేడుకున్నాడు కూడా.

also read :మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !

ఇపుడు అదేమీ లేదంటూ 

Advertisement

అయితే తాజాగా మరో సెల్ఫీ వీడియో వదిలాడు ఈశ్వర్ సాయి.అయితే ఈసారి గతంలో చెప్పిన మాటలకి భిన్నంగా తాజా వీడియోలో మాట్లాడటం గమనార్హం. ఈ వీడియోలో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం 5.30 కే షూటింగ్ ఉండటంతో ఉదయం నాలుగు గంటలకే లేచానని చెప్పుకొచ్చాడు.ఇక తన అసిస్టెంట్ వచ్చి డోర్ తీశాడని ఇక అదే సమయంలో తన భార్య వచ్చి పెద్ద గలాటా చేసిందని అని తెలిపాడు.అంటే అసలు మధ్య అసలేం జరగలేదని, కేవలం తన భార్య అలా వచ్చి ఎదో జరిగిపోయినట్టు గొడవ చేయడంతోనే బయటి ప్రపంచానికి నేనేదో తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ అయిందని తనని తానూ కవరప్ చేసుకునే ప్రయత్నం చేసుకొచ్చాడు.

ప్లేటు పిరాయిస్తున్నాడా ?

మా ఇద్దరి మధ్య గత రెండు నెలలుగా ఎమోషనల్ కనెక్షన్ ఉంది అని అంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పిన ఈశ్వర్ సాయి ఇపుడు మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు,జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబితే ఎలా నమ్ముతారనుకున్నాడో ఆయనగారికే తెలియాలి.

మెంటల్ గా డిప్రెషన్ లోకి పోయానని, ఎన్నో ఒత్తిళ్ళు చుట్టు ముడితే రిలాక్సేషన్ కోసం ఒక షోల్డర్ కోసం ఒక షోల్డర్ చూశానని ఆ షోల్డర్ మాధురి రాథోడ్ ది అయిందని, అప్పటి నుండి మా మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అయిందని చెప్పుకొచ్చిన ఈశ్వర్ సాయి ఇప్పుడిలా ఉన్న పళంగా ప్లేటు పిరాయించడం కాస్త ఆశ్చర్యమే .తప్పులు చేయడం సహజం.కాని దొరికాక కూడా అవే తప్పులని కవరప్ చేసేందుకు ఇదిగో ఇలా మరిన్ని అబద్దాలు చెబితేనే నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

పైగా ఈ వీడియో లో మళ్ళీ మాధురి రాథోడ్ కి క్షమాపణలు చెప్పడం ఇపుడు మరింత చర్చనీయాంశం అయింది.అసలు తను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూనే నెటిజన్లు తనని క్షమించాలని వేడుకోవడంతో అసలు తప్పు చేయకపోతే ఇలా క్షమించమని అడుక్కోవడం ఎందుకో అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు.

also read :ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?

ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో

ఏది ఏమైనా డ్యామేజ్ కవరేజ్ చేయడానికి ఈశ్వర్ సాయి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వొస్తుందని,అయిందేదో అయిపోయిందని ఇక నుండైనా భార్యాపిల్లల్ని చూసుకుంటూ పద్దతిగా ఉంటే బాగుంటుందని లేకపోతే ఇదిగో ఇలాగే మీడియాలో హెడ్ లైన్స్ గా కనిపిస్తారని సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి రోజు రోజుకు రాజుకుంటున్న ఈ కాంట్రవర్సీ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో !

Tags

Related News

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Big Stories

Advertisement
×