E-Paper
Advertisement

కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!

కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!
Advertisement

Supreme Court Judge: విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు క్రమంగా తగ్గిపోతుండటం, మరాఠీ స్కూల్స్ మూతపడుతుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి. వరాలే (Prasanna B. Varale) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాసిక్ కుంభమేళాకు రూ. వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.. అందులో అత్యల్ప మొత్తాన్ని కేటాయించినా వందలాది మరాఠీ పాఠశాలలను మూతపడకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ క్లాసెస్’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం దాదాపు రూ.32,000 కోట్ల నుంచి రూ.34,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తోందని జస్టిస్ వరాలే అన్నారు. వివిధ కారిడార్ ప్రాజెక్టులకు రూ.11,000 కోట్లు వెచ్చిస్తోందని గుర్తుచేశారు. ఈ ఆధ్యాత్మిక వ్యయంలో కేవలం 0.1 శాతం అంటే సుమారు రూ.32 కోట్లు విద్యారంగానికి కేటాయించి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 100 నుంచి 125 మరాఠీ మీడియం పాఠశాలలకు పునరుజ్జీవం లభించేదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాను 10వ తరగతి వరకు మున్సిపల్, జిల్లా పరిషత్ మరాఠీ మీడియం పాఠశాలల్లోనే చదువుకున్నానని జస్టిస్ వరాలే తెలిపారు. మాతృభాష లేదా ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించడం తన వృత్తిపరమైన ఎదుగుదలకు ఎప్పుడూ అడ్డంకిగా మారలేదన్నారు. అది తన ఆలోచనా పరిధిని మరింత విసృతం చేసిందన్నారు. ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ అనేవి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని అన్నారు. పాఠశాలల్లో పిల్లలకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.

Also Read: జాయ్ రైడ్‌లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!

Advertisement

దేశంలో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నప్పటికీ విద్యాశాఖ బడ్జెట్ మాత్రం పెరగకపోగా క్రమంగా తగ్గుముఖం పడుతోందని సుప్రీంకోర్టు జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో విద్యారంగానికి 13 శాతం కేటాయింపులు కూడా దాటకపోవడం విచారకరమన్నారు. ఇటీవల ఓ స్కూల్లో సరైన గదులు, మౌలిక వసతులు లేకపోవడంతో నేలపై పడుకున్న ముగ్గురు విద్యార్థినులు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చూపే శ్రద్ధను పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగంపై కూడా చూపాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!

Tags

Related News

ఎలాన్ మస్క్‌పై భారతీయులు ఆగ్రహం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కమల్‌హాసన్, అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టు విమానం లోపలే సీజేపీ నేతలు అరెస్ట్.. ఎమర్జెన్సీ కంటే దారుణమన్న కేజ్రీవాల్

హోటల్ గదిలో కుమ్మేసుకున్నారు.. భర్తని ఆ విధంగా చూసి, చెంప చెళ్లుమనిపించిన భార్య

ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఢిల్లీలో.. నన్ను అరెస్టు చేస్తే, సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

కాళ్లను గొలుసులతో కట్టేసి.. నదిలో నవ దంపతుల మృతదేహాలు!

‘మొత్తం నగరాన్ని బంద్ చేయడం ఏంటి’? ఢిల్లీ లాక్‌డౌన్‌పై సుప్రీంకోర్టు సీరియస్

అష్టదిగ్బంధనంలో రాజధాని ఢిల్లీ.. 26 వేల మంది బలగాల మోహరింపు, లిక్కర్ షాపులు క్లోజ్

భర్తపై భార్య కాళికారూపం.. గొంతుపై కాలు పెట్టి పిల్లలతో కలిసి, ఒడిషాలో షాకింగ్ ఘటన

Big Stories

Advertisement
×