Karnataka: అధికారం ఉందని జులుం ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవు. ఓ ఎమ్మెల్యే కూతురు అదే చేశారు. తండ్రి ఎమ్మెల్యే కావడంతో ఏకంగా మహిళా ఎస్ఐ చెంప ఛెళ్లుమనిపించింది. వారం రోజుల కిందట ఈ ఘటన జరగ్గా, దీనికి సంబంధించి ఫుటేజ్ ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. అసలు దేవాలయంలో ఆనాడు ఏం జరిగింది?
ఏదో విధంగా నేతల పుత్రరత్నాలు వార్తల్లోకి వస్తుంటారు. తల్లిదండ్రులు రాజకీయ నేతలు కావడంతో ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటారు. ఒక్కోసారి వారికి ఇబ్బందులు తెచ్చిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా కర్ణాటకలోని శ్రీరంగపట్నంలోని ఓ ఆలయంలో తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కూతురు ఐశ్వర్య.. ఓ మహిళా ఎస్ఐ మధ్య జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఆగష్టు 12న ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య, మహిళా ఎస్ఐ సవితా పాటిల్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఘటన జరిగిన భీమ అమావాస్య ఉత్సవాల సందర్భంగా భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఇసుక వేస్తే రాలనంత విధంగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. చాలామంది భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు.
లైన్లో వేచి ఉండాలని మహిళా ఎస్ఐ చెప్పినందుకు ఆమెపై ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య దాడి చేసింది. ఎస్ఐ చెంప చెళ్లుమనిపించింది. అక్కడే ఉన్న భక్తులు వారిని వారిద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్త్ పరిణామంతో షాకైన ఎస్‌ఐ, ఆ తర్వాత ప్రతిఘటించారు. ఈ ఘటనపై ఎస్ఐ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘటన జరిగిన రోజు భీమ అమావాస్య ఉత్సవాలు జరుగుతున్నాయి. సరిగ్గా సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం విషయంలో తలెత్తిన వివాదం కారణమని సమాచారం. మండ్య పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సవితకు ఆలయంలో డ్యూటీ వేశారు. ఐశ్వర్య ఇతరులతో కలిసి వచ్చి క్యూలో వేచి ఉండకుండా గర్భగుడిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్టు ఫిర్యాదులో ప్రస్తావించారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కొన్ని నిమిషాలు ఆగమని సవిత ఆమెని కోరింది. తాను ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్యనని పరిచయం చేసుకుని, ఆ తర్వాత ఎదురుదాడికి దిగినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం ముదిరి.. ఎస్ఐని దూషించి, చెంపదెబ్బ కొట్టినట్టు పేర్కొన్నారు. ఆమె కెరీర్‌ను దెబ్బతీస్తానని బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు.
ఐశ్వర్యపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. జరిగిన ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ నోరు విప్పారు. తన కుమార్తె ప్రవర్తనలో తప్పు జరిగినట్లు తేలితే క్షమాపణలు చెప్పారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఐశ్వర్య తన చిన్న పిల్లలతో గుడికి వెళ్లిందని, క్యూలో వేచి ఉండటం ఇబ్బంది కలిగించవచ్చని, లోపలికి వెళ్లడానికి అనుమతి కోరిందని తెలిపారు.
ALSO READ: వీడొక పరమనీచుడు.. భార్య ఏకాంత వీడియోలు అందులో పెట్టి..
ఆలయంలో మహిళా SIపై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి
కర్ణాటకలోని శ్రీరంగపట్నం ఆలయంలో తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య, విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ సవితా పాటిల్‌పై చెయ్యి చేసుకున్నారు. లైన్లో వేచి ఉండాలని కోరినందుకు ఎస్ఐపై ఐశ్వర్య దాడి చేయగా, ఎస్ఐ కూడా… pic.twitter.com/CFdvU2sA7s
— BIG TV Breaking News (@bigtvtelugu) August 25, 2026