Breaking: ఘనాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సైనిక హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు క్యాబినెట్ మంత్రులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. సెంట్రల్ ఆశాంతి ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో రక్షణ మంత్రి ఎడ్వర్డ్ ఒమానే బోమా, పర్యావరణ మంత్రి ఇబ్రహీం ముర్తాల ముహమ్మద్ చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. ఈ సంఘటనను అక్కడి ప్రభుత్వం జాతీయ విషాదంగా ప్రకటించింది. ఇద్దరు మంత్రులు మృతి చెందడంతో అక్కడి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది
Also Read: కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్లుగా ఫోకస్ అవుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్
జాతీయ విషాదంగా ప్రకటించిన ఘనా ప్రభుత్వం
అయితే ముగ్గురు సిబ్బంది సహా ఎనిమిది మందితో Z-9 హెలికాప్టర్ రాజధాని అక్రా నుండి ఒబువాసికి బయల్దేరింది. టేకాఫైన కాసేపటికే హెలికాప్టర్ ఏటీసీతో కమ్యూనికేషన్ తెగిపోయి క్రాష్ అయింది. ఈ ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల్లో ఘనా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ మునీర్ మహమ్మద్, నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ వైస్ ఛైర్మన్ శామ్యూల్‌తో పాటు ఇతర సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బోమా నివాసంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయానికి సంతాప సందేశాలు వచ్చాయి. ఘనా ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని జాతీయ విషాదంగా అభివర్ణించింది.