BigTV English

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

MP News:  దేశవ్యాప్తంగా టూ వీలర్స్ వాహనదారులు హెల్మెంట్లు లేకుండా ప్రమాదాలు బారినపడి యువత అధికంగా మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం ట్రాన్స్‌పోర్టు మంత్రి గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ప్రమాదాలను అరికట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా టూ వీలర్స్ వాహనదారులు పట్టించుకోలేదు. చివరకు హెల్మెంట్ లేని వారికి పెట్రోల్ ఇవ్వడం లేదు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.


దేశంలోని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల్లో  టూ వీలర్స్ వాహనదారులకు కచ్చితంగా హెల్మెంట్ ఉండాల్సిందే. లేకుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఫైన్ వేయడం చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేయడం చేస్తున్నారు. దీనివల్ల సిటీలో యాక్సిడెంట్ తగ్గినట్టు ఓ అంచనా.

ఇదే పద్దని మిగతా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఆగస్టు ఒకటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఇండోర్ నగరాల్లో నో హెల్మెంట్.. నో పెట్రోల్ ఆదేశాలను బంకులు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇది మిగతా జిల్లాలకు క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా భిండ్ జిల్లాకు పాకింది. అక్కడ నో హెల్మెంట్.. నో పెట్రోల్ కాన్సెప్ట్‌‌ని పెట్రోల్ పంపులు అమలు చేస్తున్నాయి.


ఈ రూల్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద వారిపై కఠినచర్యలు తప్పవని చెబుతున్నారు. వారానికి రెండు జిల్లాల చొప్పున ఈ రూల్స్ విధించడంతో ఈనెల చివరికి రాష్ట్రమంతా అమలు చేసే అవకాశముందని అంటున్నారు.

ALSO READ: కూలిన హెలికాఫ్టర్.. మంత్రులు మృతి

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరు తెర వెనుక అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది వాహనదారులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పెట్రోల్ కొనుగోలు చేయడానికి కొందరు ఈ రూల్స్‌ని పక్కదారి పట్టిస్తున్నారు.

హెల్మెట్‌లను కొద్ది గంటలపాటు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కూడా ఇండోర్‌లో వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై మీడియాకు చిక్కడంతో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తానికి కొద్దిరోజుల్లో దేశవ్యాప్తంగా హెల్మెంట్ పద్దతి రావచ్చని అంటున్నారు విశ్లేషకులు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×