BigTV English

Two killed in Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Two killed in Fire Accident : భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం

Two killed in Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతంలో గల ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. తలనగరి ప్రాంతంలో.. ఇనుమును కరిగించే కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవ్వగా.. డజన్ మందికి పైగా వర్కర్లు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫ్యాక్టరీలో అమర్చి ఉన్న ఫర్నేస్ లో ఇనుమును కరిగిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.


పేలుడు ఘటన తర్వాత.. కంపెనీ నుంచి మంటలు భారీగా ఎగసి పడటంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇనుమును కరిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు మృతుల్లో ఒకరి బంధువులు తెలిపారు. ఇనుము లావా కొందరు యువకులపై పడటంతో.. వారు కూడా గాపడ్డారు.

ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ నిర్వాహకులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ కు సమాచారమివ్వగా.. రెస్క్యూ టీమ్ ఫ్యాక్టరీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.


Tags

Related News

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Indian Constitution: పొరుగు దేశాలు చూశారా ఎలా ఉన్నాయో.. నేపాల్, బంగ్లాదేశ్‌లపై.. భారత సుప్రీం కోర్డు కీలక వ్యాఖ్యలు

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Big Stories

×