BigTV English

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో ఓ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఒక షాపులో మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ వేగంగా వ్యాపించాయి. చాలా వరకు షాపులు దగ్దమయ్యాయి. ఈ మంటలను చూసి ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగు పెట్టారు. ఈ ఘటన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది.


గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న ఓ షాపులో ఈ రోజు ఉదయం  10.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఇతర ప్లాట్ ఫామ్‌లపై గల దుకాణాలకు వ్యాపించాయి. అప్పుడు ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌లపై ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ మంటల గురించి రైల్వే పోలీసులు, బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే పనిలో పడ్డారు.

Also Read: RTC Bus: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు


రెండు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సియల్డా సౌత్ సెక్షన్‌ రైళ్ల సేవలు కొంత సేపు నిలిచిపోయాయి.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×