BigTV English

Fog Effect : పొగమంచు ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!

Fog Effect : పొగమంచు.. ప్రజలను ఊహించని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ పొగ మంచు కారణంగా ఒక వైపు రోడ్డు ప్రమాదాల్లో పలువురు అసువులు భాస్తుంటే.. మరి కొందరు తేవేర గాయాలతో బయపటపడుతున్నారు. ఇక నెలపైనే ఈ పరిస్థితి ఉంటే నింగిలో సైతం మరింత అలజడి చేస్తుంది పొగ మంచు. ఇప్పటికే ఈ పొగ మంచు వల్ల విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Fog Effect : పొగమంచు  ఎఫెక్ట్.. ఆలస్యంగా నడుస్తోన్న విమానాలు.. ప్రయాణికులు ఫైర్..!

Fog Effect : పొగమంచు.. ప్రజలను ఊహించని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ పొగ మంచు కారణంగా ఒక వైపు రోడ్డు ప్రమాదాల్లో పలువురు అసువులు భాస్తుంటే.. మరి కొందరు తేవేర గాయాలతో బయపటపడుతున్నారు. ఇక నెలపైనే ఈ పరిస్థితి ఉంటే నింగిలో సైతం మరింత అలజడి చేస్తుంది పొగ మంచు. ఇప్పటికే ఈ పొగ మంచు వల్ల విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో వందల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


పొగ మంచు కారణంగా జీరో విజిబులిటీతో విమానాలు దిగడానికి ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో ఒక్క ఢిల్లీ విమానాశ్రయంలోనే 168 విమానాలు ఆలస్యంగా నడవగా.. దాదాపు 100 విమానాలను రద్దు చేశారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. పలు విమానాశ్రయాల్లో ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో సైతం విమానాశ్రయాలల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వేచి ఉండేందుకు స్థలం, ఆహారం వంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదంటూ.. ప్రయాణికులు, పలువురు ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీలో అయితే ఏకంగా విమానం ఆలస్యమైనందుకు ఓ వ్యక్తి పైలట్‌పైనే దాడి చేయడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే పౌర విమానయానశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రతికూల వాతావరణం కారణంగా 3 గంటలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో విమానాన్ని ముందస్తుగా రద్దు చేయవచ్చని డీజీసీఏ తెలిపింది. విమానాల రద్దు, ముందస్తు సమాచారం లేకుండా ఆలస్యమయ్యే సందర్భాల్లో ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థ పూర్తి రక్షణ, సదుపాయాలు కల్పించాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలను విమానయాన సంస్థలన్నీ తక్షణమే పాటించాలని ఆదేశించింది.


తాజా మార్గదర్శకాల ప్రకారం.. విమాన ఆలస్యానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని సదరు విమానయాన సంస్థ వెబ్‌సైట్‌లో వెల్లడించాలని పేర్కొంది. ముందస్తు సమాచారాన్ని ప్రయాణికులకు ఎస్‌ఎంఎస్‌ లేదా ట్సప్‌, ఈ-మెయిల్‌ రూపంలో తెలియజేయాలని సూచించింది. ఆలస్యానికి సంబంధించి వాస్తవిక సమాచారాన్ని విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులకు తెలపాలని చెప్పింది. ప్రయాణికులతో సంప్రదింపులు జరిపేందుకు, నిరంతరం మార్గనిర్దేశం చేసేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

అలానే దేశంలో 6 మెట్రో విమానాశ్రయాల్లో వార్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి సింధియా వెల్లడించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల్లో జరిగే సంఘటలను రోజూ 3 సార్లు కేంద్రానికి నివేదించాలని ఆదేశించారు. ప్రయాణికుల అసౌకర్యానికి సంబంధించిన సమస్యల తక్షణ పరిష్కారానికి.. ఈ 6 చోట్ల ఎయిర్‌లైన్‌ ఆపరేటర్లు.. వార్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తారని తెలిపారు. విమానాశ్రయాల్లో నిరంతరం తగినంత మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×