BigTV English

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS IN HYDERABAD : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MURDERS : హత్యలకు అడ్డాగా హైదరాబాద్.. వారం రోజుల్లో అరడజన్ కి పైగా మర్డర్స్..

MURDERS : హైదరాబాద్ శివారు ప్రాంతాలు హత్యలు, ఆత్మహత్యలకు అడ్డాగా మారాయి. వారం రోజుల్లో అరడజనకు పైగా ఘటనలు వెలుగు చూశాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ఘటనలతో నగరం ఉలిక్కి పడింది. బ్రాహ్మణపల్లి ఔటర్ రింగురోడ్డు దగ్గర మృతదేహం కలకలం రేపింది. గోనే సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఔటర్ రింగ్ రోడ్‌పై నుండి గుర్తుతెలియని వ్యక్తులు కిందకి పారేశారు. దుర్వాసన రావడంతో మృతదేహాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే మరో మర్డర్ వార్త నగరాన్ని భయాందోళలకు గురి చేసింది. హైదరాబాద్ శివార అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశారు. అత్యంత కిరాతకంగా తలను నరికేసి.. మొండాన్ని వేరు చేశారు. JNNURM కాలనీలో ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు విజయ్‌ను.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మంగళవారం ఉదయాన్నే నార్సింగిలో ఓ వాచ్ మెన్ దారుణ హత్యకు గురైయ్యాడు. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో జంగయ్య అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అర్జున్ అనే తాపీ మేస్త్రి కూడా అక్కడే పనిచేస్తున్నాడు. బిల్డింగ్ యజమానికి తెలియకుండా అర్జున్ స్క్రాప్‌ను అమ్ముకుంటున్నాడు. ఈ విషయాన్ని వాచ్‌మెన్.. యజమానికి చెప్పాడు. దీంతో.. అర్జున్ మద్యం సేవించి ఆగ్రహంతో వాచ్‌మెన్ జంగయ్యను ఇనప కడ్డీతో తలపై బాది హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


రెండు రోజుల క్రితం వికారాబాద్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. గుర్తుతెలియని మహిళపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వికారాబాద్ జిల్లా గ్రామం పుల్ మద్ది శివారు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మృతదేహాన్ని గుర్తించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేరించారు. ఈ కేసు పోలీసులకు ఛాలెంజిగ్ గా మారింది. చనిపోయిన మహిళ ఎవరో తెలియదు.. చంపిన దుండగుల గురించి తెలియదు. ఎందుకు చంపారో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసును ఛేదించేందుకు తలమునకలై ఉన్న పోలీసులకు మంగళవారం వరుస ఘటనలు మరింత సవాల్ గా మారాయి. అటు.. వరుస హత్యలతో నగరవాసులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×