BigTV English

Shadow Cabinet: నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి షాడో క్యాబినెట్

Shadow Cabinet: నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి షాడో క్యాబినెట్

Shadow Cabinet: మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన సీఎం మోహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో పాటు జవాబుదారీ చేసేందుకు షాడో క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలను కూడా కేటాయించారు.


మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. షాడో మంత్రి వర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వులను కూడా ఆ పార్టీ విడుదల చేసింది. నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన షాడో క్యాబినెట్‌లో ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు. అలాగే ఎలాంటి ఆధారాలు కూడా దీనికి ఉండవు. జూలై 22 నుంచి ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతలను ఈ షాడో మంత్రివర్గాన్నికి అప్పగించారు.

దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో శాఖలను పర్యవేక్షించే జేడీయూ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. తద్వారా సీఎం మోహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో షాడో కేబినెట్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్‌ లో ప్రతి పక్ష పార్టీలకు షాడో క్యాబినెట్ మాధురి సంస్థాగత వ్యవస్థలు కూడా ఉన్నాయి. షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ప్రతిపక్ష విమర్శకుడిగా వ్యవహరిస్తాడు.


Also Read: పూజా ఖేడ్కర్‌ ఐఏఎస్ అభ్యర్థిత్వం రద్దు.. మరో సారి పరీక్ష రాయకుండా డిబార్

బ్రిటన్‌ షాడో క్యాబినెట్‌లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ప్రతి ఒక మంత్రికి ఒక శాడోను నియమిస్తారు. ఆ మంత్రి పనితీరు అభివృద్ధి విధానాలను వారు అధ్యయనం చేస్తూ ఉంటారు. ఆ మంత్రులు తీసుకునే నిర్ణయాలు చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తారు. ఒడిశాలో జులై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గాన్నికి అప్పగించింది.

Tags

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×