BigTV English

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: వయనాడ్ కొండ గుహలో చిక్కుకున్న గిరిజనులు.. తర్వాత ఏమైందంటే ?

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్ కొండపైకి ఎక్కారు. భారీ వర్షం కారణంగా గుహలో తలదాచుకున్న వారంతా అక్కడ చిక్కుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కేరళ అటవీ శాఖ అధికారులు పెద్ద సాహసమే చేశారు. కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హషీష్ నేతృత్వంలో నలుగురు సభ్యులు నాలుగున్నర గంటలపాటు నడిచి వారు ఉన్న కొండపైకి చేరుకున్నారు.


గిరిజనులు తల దాచుకున్న గుహకు ఎదురుగా ఉన్న లోయ వద్దకు.. గుహలో ఉన్న తన భర్త, పిల్లల  ఆహారం కోసం బయటకు వచ్చిన మహిళలను అధికారులు గుర్తించారు. అనంతరం ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న నలుగురు పిల్లలు, భార్యా భర్తలతో కూడిన కుటుంబం గురించిన ఆచూకీని అధికారులకు చేరవేసారు. గుహలో చిక్కుకున్న వారు వయనాడ్‌లోని పానియా గిరిజన కమ్మునిటీకి చెందిన కుటుంబం అని ఫారెస్ట్ అధికారి హషీష్ వెల్లడించారు. అటవీ ప్రాంతంలో ప్రాణాలకు తెగించి గిరిజన కుటుంబాన్ని కాపాడిన అటవీ శాఖ అధికారులను సీఎం విజయన్ ప్రశంసించారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×