BigTV English

Karpoori Thakur : బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న.. ఇంతకీ ఆయన దేశానికి ఏం చేశారు?

Karpoori Thakur : బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న.. ఇంతకీ ఆయన దేశానికి ఏం చేశారు?

Karpoori Thakur : బీహార్ మాజీ సీఎం, కర్పూరీ ఠాకూర్‌కు కేంద్రప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్పూరీ ఠాకూర్‌ శతజయంతి సందర్భంగా ఈ ప్రకటన చేశారు. దీంతో, ఎవరీ కర్పూరీ ఠాకూర్.. ఆయన దేశానికి అందించిన సేవలు ఏంటీ అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. నేటి తరానికి కర్పూరీ ఠాకూర్ పేరు కొత్తగా అనిపించినా.. దేశంలో రాజీకీయ, సామాజిక సమానత్వానికి ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. దేశంలో పలు ప్రాంతాల్లో బీసీలు రాజకీయంగా ఎదిగారు అంటే ఆయనే ప్రధాన కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


1924 జనవరి 24న బీహార్‌లో సమస్థిపూర్‌ జిల్లాలో నాయీబ్రాహ్మణ సామాజిక వర్గంలో ఆయన జన్మించారు. ఆయన యుక్తవయసు వచ్చేనాటికి దేశంలో స్వాతంత్రోద్యమం ఉదృతంగా సాగుతోంది. దీంతో.. ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థిసంఘంలో చేరారు. కాలేజీ చదువులు వదిలిపెట్టి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1942 నుంచి 45 మధ్య జైలు జీవితం గడిపారు. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952లో సోషలిస్టు పార్టీ తరఫున బిహార్‌ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి బిహార్‌ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేశారు. 1970 డిసెంబరులో తొలిసారిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు పదవిలో ఏడు నెలలు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 1977లో మరోసారి సీఎంగా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పుడు రెండేళ్లు ఆ పదవిలో ఉన్నారు. మొదటిసారి సీఎంగా ఉన్నపుడే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేశారు. ఆ రోజుల్లో అదో పెద్ద సాహసమని చెప్పాలి.


ఇక బీసీ రిజర్వేషన్లు అంటే.. అందరికీ గుర్తొచ్చేది మండల కమిషన్. కానీ.. అంతకంటే చాలా ముందు నుంచే బీహార్‌లో విద్య, ఉద్యోగాల్లో బీసీలకు కర్పూరీ ఠాకూర్ రిజర్వేషన్లు కల్పించారు. కులవివక్షకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం పోరాడారు.

రామ్‌ మనోహర్‌ లోహియా ప్రభావం ఆయనపై బలంగా పడింది. అంతే కాదు.. దిగ్గజ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌తోనూ కర్పూరీ ఠాకూర్ సన్నిహితంగా ఉండేవారు.
ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ప్రస్తుతం బలమైన రాజకీయ శక్తులుగా ఉన్న లాలూ, ములాయం, నితీశ్‌ కుమార్ బీసీ నేతలు కర్పూరీ ఠాకూర్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లో చాలా ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆయన పేరు పెట్టారు. ఆయన స్వగ్రామం పితోంఝియాను కర్పూరీగ్రామ్‌గా పిలుస్తున్నారు.

నిరాడంబరమైన జీవితానికి కర్పూరీ ఠాకూర్ నిలువెత్తు నిదర్శనం. రెండుసార్లు బిహార్‌ సీఎంగా పని చేసినప్పటికీ ఆయనకు సొంత ఇల్లు, కారు లేవు. అంతేకాదు.. సరైన దుస్తులు కూడా ఉండేవి కావు. వాటి గురించి ఆయన ఎన్నడూ పట్టించుకునే వారు కాదు.

.

.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×