BigTV English

Punganuru Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పుంగనూరులో త్రిముఖ పోరు.. గెలుపు జెండా పాతేదెవరు ?

Punganuru Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. పుంగనూరులో త్రిముఖ పోరు.. గెలుపు జెండా పాతేదెవరు ?

Punganuru Assembly Constituency : రాయలసీమ పాలిటిక్స్‌లో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పుంగనూరు. ఓ రకంగా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా మారిందనే చెప్పాలి. ఆయనపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా.. నియోజకవర్గానికి పెద్దిరెడ్డి ఇంపార్టెంట్స్‌ ఇస్తారన్న టాక్ ఉంది. ఇక్కడ ఆయనను ఢీకొట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని ఇతర పార్టీలకు తెలుసుకుకాబట్టే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఈ సారి టీడీపీ చల్లా రామచంద్రారెడ్డిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తోంది. పెద్దిరెడ్డిని ఆయన ఇలాఖాలోనే మట్టి కరిపించాలన్నది టీడీపీ పంతంగా కనిపిస్తోంది. అయితే మరో నేత రామచంద్ర యాదవ్ పేరు నియోజకవర్గ రాజకీయాల్లో పదేపదే వినిపిస్తోంది. 2019లో జనసేన తరఫున పోటీ చేసిన రామచంద్ర యాదవ్.. 16వేలకు పైగా ఓట్లు సాధించారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై ఈ మధ్య జరిగిన దాడి.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.


తనకున్న ఢిల్లీ పరిచయాలతో వై ప్లస్ భద్రత సాధించుకున్నారు రామచంద్ర. ఆయన ఈసారి ఆయన భారత చైతన్య యువజన పార్టీ తరపున బరిలోకి దిగనున్నారు. ఈ త్రిముఖ పోటీలో గెలిచి నిలిచేదెవరు? పుంగనూరు అసెంబ్లీలో సీన్ ఏంటి? పెద్దిరెడ్డి ప్రభావం ఎంతలా ఉండబోతోంది? అన్న దానిపై బిగ్‌ టీవీ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నిలక ఫలితాలను పరిశీలిద్దాం.

2019 RESULTS


2019 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి ఏకంగా 55 శాతం ఓట్‌ షేర్‌తో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి కంటే ఆయన ఏకంగా 22 శాతం ఎక్కువ ఓట్లు సాధించారంటే పుంగనూరుపై ఆయన పట్టు ఏంటో అర్థం చేసుకోవచ్చు. గడచిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధే ఆయనను గెలిపిస్తూ వస్తోంది. ప్రజల్లో ఆయనకు ఉన్న సానుకూలత, బలమైన క్యాడర్‌ సపోర్ట్‌తో పాటు వైసీపీ వేవ్ ఆయనకు బంపర్‌ విక్టరీని సాధించి పెట్టాయి. అదే సమయంలో టీడీపీ తరపున పోటీ చేసిన అనీషా రెడ్డికి 33 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే జనసేన నుంచి బరిలోకి దిగిన రామచంద్ర యాదవ్‌కు అనూహ్యంగా 8 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆయన ఈ ఎన్నికల్లో 16 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇవి గత ఎన్నికల ఫలితాల వివరాలు. మరి ఈసారి రాజకీయ పరిణామాలు చాలా మారాయి. మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డిపై విపక్షాలు విమర్శలు, ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి. మరి పరిస్థితులు ఏమైనా మారాయా? ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? టీడీపీ నుంచి ఎవరికి టికెట్ దక్కే అవకాశం ఉంది? అనే దానిపై బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ సర్వే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

మూడుసార్లు వరుసగా గెలుస్తూ రావడం

బలమైన క్యాడర్ ఉండటం

ప్రజల్లో ఉన్న సానుకూలత

పుంగనూరులో జరిగిన అభివృద్ధి

ప్రజలతో నిత్యం టచ్‌లో ఉండటం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనస్ పాయింట్స్

రామచంద్ర యాదవ్‌పై పెద్దిరెడ్డి అనుచరుల దాడి

చల్లా రామచంద్రారెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

ప్రజలతో నిత్యం టచ్‌లో ఉండటం

బలమైన క్యాడర్‌ సపోర్ట్‌

కలిసి రానున్న జనసేన పొత్తు

చల్లా రామచంద్రారెడ్డి మైనస్ పాయింట్స్

గత ఆరు నెలలకు ముందు వరకు యాక్టివ్‌గా లేకపోవడం

బోడె రామచంద్ర యాదవ్ (BCYP) ప్లస్ పాయింట్స్

సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లడం

ప్రజలకు సొంత నిధులతో మేలు చేయడం

బోడె రామచంద్ర యాదవ్ మైనస్ పాయింట్స్

ప్రజల్లోకి అంత బలంగా వెళ్లలేకపోవడం

Caste Politics

పుంగనూరు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో శెట్టి బలిజ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీరు మొత్తం 19 శాతం ఉండగా.. ఇందులో 55 శాతం వైసీపీకి మద్ధతు పలుకుతున్నారు. ఈ సామాజిక వర్గ నేతలకు వైసీపీలో ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో వారు ఎక్కువగా మద్ధతు తెలుపుతున్నట్టు సర్వేలో తేలింది. ఇక టీడీపీ, జనసేన కూటమికి 35 శాతం మద్ధతు తెలుపుతున్నారు. అయితే పెద్దిరెడ్డి తమను రాజకీయంగా ఎదగడనీయడం లేదన్న భావనలో ఉన్నవారంతా టీడీపీకి జై కొడుతున్నారు. మిగిలన 10 శాతం మంది ప్రజలు ఇతరులకు మద్దతిస్తున్నారు. 17 శాతం ఉన్న ముస్లీంలలో 55 శాతం మంది వైసీపీకి మద్దతు తెలుపుతుండగా.. టీడీపీ కూటమికి 40 శాతం.. ఇతరులకు 5 శాతం మద్దతిస్తున్నారు. టీడీపీ హయాంలో మైనారిటీ కార్పొరేషన్‌ లోన్లు తీసుకొని లబ్ధి పొందిన అనేక మంది ఇప్పటికి కూడా టీడీపీకే మద్ధతు పలుకుతున్నారు. 16 శాతం ఉన్న ఎస్సీల్లో మెజారిటీ అంటే 60 శాతం మంది వైసీపీకే తమ మద్ధతును ప్రకటించారు.

టీడీపీకి 35 శాతం, ఇతరులకు 5 శాతం తమ మద్ధతును తెలిపారు. 14 శాతం ఉన్న యాదవ సామాజిక వర్గ ప్రజల్లో కూడా వైసీపీకి 30 శాతం, టీడీపీ కూటమికి 25 శాతం మద్ధతిస్తుండగా.. అనూహ్యంగా ఇతర పార్టీ నేతలకు 45 శాతం మద్ధతిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది రామచంద్ర యాదవ్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక 10 శాతం ఉన్న పాలేకి సామాజిక వర్గంలో 55 శాతం మంది వైసీపీకి.. టీడీపీ కూటమికి 40 శాతం.. ఇతరులకు 5 శాతం మంది మద్ధతిస్తున్నారు. ఓసీ కేటగిరిలో ఉన్న ఈ సామాజిక వర్గాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీసీల్లోకి మార్చారు. దీంతో వైసీపీకి వీరు తమ మద్ధతు పలుకుతున్నారు. అయితే వీరికి రాజకీయంగా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని భావిస్తున్న వారంతా టీడీపీకి జై కొడుతున్నట్టు బిగ్‌ టీవీ సర్వేలో తేలింది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (YCP) vs చల్లా రామచంద్రారెడ్డి (TDP)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గెలుపు అవకాశాలు 49 శాతం ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. ఇక 36 శాతంతో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఉండనున్నారు. పెద్దిరెడ్డి ఒక్క పుంగనూర్‌లోనే కాకుండా మొత్తం జిల్లాలోనే చరిష్మా ఉన్న నేత కావడంతో ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఆయన పాపులారిటీని భారీ ఎత్తున దెబ్బతీసే అవకాశం లేదని సర్వే రిపోర్ట్ చెబుతోంది. దీనికి తోడు ఈ నియోజకవర్గంలో వైసీపీ చాలా పాపులర్ పార్టీ అనే చెప్పాలి. అయితే BCYP పార్టీ బోడె రామచంద్ర యాదవ్‌కు 7 శాతం ఓట్లు పోలవుతాయని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. ఆయన సామాజిక వర్గ ఓట్లతో పాటు.. అధిక శాతం ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉంది. ఇది పుంగనూరు నియోజకవర్గ పరిస్థితి.

.

.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×